breaking news
Brinton
-
కరోనా : మరో చౌక ఔషధానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు సంబంధించి యాంటీ వైరల్ డ్రగ్ 'ఫావిపిరవిర్' విక్రయాలకు అనుమతి లభించిందని పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిందని బ్రిటన్ ఫార్మాస్యూటికల్స్ గురువారం వెల్లడించింది. 'ఫావిటన్' బ్రాండ్ పేరుతో 200 మి.గ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ టాబ్లెట్లను 59 రూపాయల చొప్పున విక్రయిస్తామని బ్రింటన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫాబిఫ్లూ తరువాత, చవకగా లభించనున్న డ్రగ్ ఇదే కావడం విశేషం. ఫావిటన్ టాబ్లెట్ ధర 59 రూపాయలు. కాగా ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ ధర 75 రూపాయలు. తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతమైన అనుకూలమైన ఫలితాలిస్తోందని, ఇందుకు క్లినికల్ సాక్ష్యాలున్నాయని బ్రింటన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందనీ వెల్లడించింది. తమ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఈ ఔషధ లభ్యతను మెరుగుపరచడమే తమ ఉద్దేశమనీ, అన్ని కోవిడ్ కేంద్రాల్లో ఫావిటన్ను అందుబాటులో ఉంచనున్నామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా చెప్పారు. అలాగే దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. కాగా జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఫుజిఫిల్మ్ టొయమా కెమికల్ కంపెనీ ఫావిపిరవిర్ ను ‘అవిగాన్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. ఫావిటన్ అనేది అవిగాన్ జెనరిక్ వెర్షన్. -
బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్‌బుక్క'య్యాడు
లండన్: ఇంగ్లండ్‌లో 35 ఏళ్ల మాథ్యూ బ్రింటన్ అంటే ఇప్పుడు తెలియని వాళ్లు లేరు. అతనేమి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు. సెలబ్రిటీ అంతకన్నా కాదు. న్యూక్వేలోని బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కునే బిచ్చగాడు. భిక్షాటన ముగించుకొని 50 లక్షల రూపాయలు విలువచేసే ఆడి స్పోర్ట్స్ కారులో ఇంటికి బయల్దేరుతున్నప్పుడు ఎవరో ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యంత ఖరీదైన బిచ్చగాడుగా ఇప్పుడు అందరికి తెలిసి పోయింది. ఫేస్బుక్ పోస్ట్‌తో అతని బతుకు బస్టాండ్ అయింది. పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన అతని ఆడి కారును ఎవరో దొంగలెత్తుకు పోయారు. ఇప్పుడు ఎవరూ అతనికి బిచ్చం వేయడం లేదు. చూడగానే అసహ్యించుకుంటున్నారు. ఇల్లు, కారు పెట్టుకొని అడుక్కుతింటున్నావా అంటూ నానా బూతులు తిడుతున్నారు. ఫేస్బుక్లో వ్యతిరేకంగా కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఇంతకాలం ప్రజల్ని మోసం చేసినందుకు చంపెస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. బెదిరింపులు వస్తున్న మాట నిజమేనని, జాగ్రత్తగా ఉండాల్సిందిగా బ్రింటన్ను హెచ్చరించామని న్యూక్వే పోలీసు ఉన్నతాధికారి డేవ్ మెరిడిత్ మీడియాతో వ్యాఖ్యానించారు. అతన్ని ఎన్నో ఏళ్లుగా బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కోవడం చూశానని, తాను పెద్దగా సహాయం చేయలేక పోయాయని మరో పోలీసు అధికారి తెలిపారు. తాను అడుక్కున్న సొమ్ముతో ఖరీదైన కారు కొనుక్కోలేదని, అడుక్కోవడం వల్ల అంత సొమ్ము తనకెప్పుడూ రాలేదని, తన తాత గిఫ్టు కింద ఆ కారు ఇచ్చి వెళ్లారని బ్రింటన్ వాపోతున్నాడు. ఫేస్బుక్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని, అది చూసే డివైస్ కూడా తన వద్ద లేదని, ఇప్పుడు అదే ఫేస్బుక్ తన కొంప ముంచిందని బ్రింటన్ బావురుమంటున్నాడు. కాయకష్టం చేసుకొని బతికేంత ఆరోగ్యంగా అతను ఉండడంతోపాటు అతను పెంచుకుంటున్న కుక్క కూడా అంతే ఆరోగ్యంగా ఉంది. ఫేస్బుక్లో అతనికి అనుకూలంగా కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఎందుకతన్ని ఆడిపోసుకుంటారు. కుక్కను బాగానే చూసుకుంటున్నాడు కదా!....ఒకరి గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం...అంటూ కామెంట్లు వచ్చాయి.