breaking news
bribery scandal
-
లంచాల కోసం.. ఏకంగా కార్యాలయం!
వేలూరు (తమిళనాడు): లంచాలు వసూలు చేసేందుకు ఏకంగా కార్యాలయాన్నే నడపడంతో పాటు 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఓ అధికారి. విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు సత్‌వచ్చారిలో టౌన్‌ప్లానింగ్ జోన్ అసి స్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో సుబ్రమణియన్ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతిలేని ఇళ్ల స్థలాలు, పరిశ్రమలకు అనుమతులిస్తూ ఉంటాడు. అక్కడి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం కార్యాలయంలో విజిలెన్స్ డీఎస్పీ శరవణకుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారిలోని వివేకానందనగర్‌లో సుబ్రమణియన్.. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఓ రిటైర్డ్ అధికారిని నియమించుకున్నాడు. ఆయన కింద 37మంది సిబ్బందిని నియమించి లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో రూ.3 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకుని, సుబ్రమణియన్‌ను అరెస్ట్ చేశారు. -
ఐటీ శాఖలో భారీ అవినీతి.. అధికారులు, సీఏల దందా
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖలో భారీ అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. లంచం కేసులో ఐటీ శాఖ జాయింట్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారితో పాటు ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఓ వ్యాపారవేత్త, మధ్యవర్తులు దొరికిపోయారు. సీబీఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐటీ శాఖ విచారణ విభాగంలో పని చేసే అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలు చేతులు కలిపి.. కంపెనీలు, బడా ప్రముఖుల ఐటీ లావాదేవీలను పరిష్కారించడానికి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నట్టు సీబీఐ దృష్టికి వచ్చింది. సీబీఐ ఈ వ్యవహారంపై నిఘా వేసి.. శనివారం ముంబై, చెన్నైలో దాడులు నిర్వహించింది. చెన్నై ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ సలోంగ్ యాడెన్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. అరెస్టయిన వారిలో సీఏలు సంజయ్ బండారి, శ్రేయ బండారి, చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ తదితరులున్నారు. చెన్నై ఐటీ విచారణ విభాగం చీఫ్, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి 10 లక్షలు లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. గతంలో ఐటీ అధికారులు దాడులు చేసి బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పరిష్కారం కోసం ఐటీ విచారణ విభాగం చీఫ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాగా సీబీఐ అధికారులు ఆయన పేరును రహస్యంగా ఉంచారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ పలు కంపెనీలపై నిఘా వేసింది.