breaking news
breast cancer drug
-
రొమ్ము కేన్సర్ ఔషధ ధరలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్స కు ఉపయోగించే ‘ట్రాస్టూజుమాబ్’ ఔషధ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏకంగా 65 శాతం తగ్గుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గురువారం తెలిపింది. ప్రస్తుతం వీటి ధర ఒక కోర్సుకు రూ.14.20 లక్షలుగా ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలకు దాన్ని తయారు చేసే అవకాశం కల్పించడంతో దాని ధర తగ్గనుంది. 65 శాతం ధర తగ్గితే ఆ ఔషధం రూ.4.97 లక్షలకే లభించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రులే ఈ ఔషధాన్ని రోగులకు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, ఆరోగ్యశ్రీ రోగులకు ఈ ఔషధాన్ని వాడట్లేదు. ధర తగ్గడం వల్ల ఆరోగ్యశ్రీ రోగులకు కూడా దీన్ని ఇచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రొమ్ము కేన్సర్ చికిత్సకు దేశీయ కంపెనీ ఔషధం కూడా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఔషధ రంగ సంస్థ బయోకాన్ రొమ్ము(స్తన) కేన్సర్ చికిత్స కోసం ‘కాన్‌మాబ్’ అనే సూది మందును ఆవిష్కరించింది. బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ మేరకు శనివారమిక్కడ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాన్‌మాబ్ ఔషధం ఫిబ్రవరి తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ అమెరికా సంస్థ తయారు చేసిన ‘హర్సెప్టిన్’ అనే ఔషధాన్ని దేశంలో వాడుతున్నారు. ఆ మందు ధర రూ.75 వేలు కాగా, కాన్‌మాబ్ ధర 25 శాతం తక్కువ. కాన్‌మాబ్ ఔషధం 150 మిల్లీగ్రాముల మోతాదు ధరను రూ.19,500గా, 440 మిల్లీగ్రాముల ధరను రూ.57,500గా నిర్ణయిం చారు. వ్యాధిస్థాయిని బట్టి.. ఈ ఔషధంతో రెండు నుంచి మూడు నెలల్లో కేన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని షా తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో ఈ ఔషధానికి రూ.130 కోట్ల మేరకు మార్కెట్ ఉంది.