breaking news
bonaboina srinivas yadav
-
‘అద్దెకిచ్చిన ఇంటినే ఆక్రమించుకున్నావ్’
సాక్షి, గుంటూరు : గుంటూరులో గల్లా జయదేవ్ తనకు అద్దెకిచ్చిన ఇంటినే బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నాడని జనసేన గుంటూరు లోక్‌సభ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ పెద్ద భూ కబ్జాదారుడన్నారు. రాజధానిలో రాజన్న ట్రస్ట్ పేరుతో పది ఎకరాల భూమిని కొట్టేయడానికి జయదేవ్ ప్లాన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి.. ప్రైవేట్ కంపెనీల మధ్య గల్లా జయదేవ్ బ్రోకర్‌గా పని చేస్తున్నాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా ప్రజలు గల్లా కుటుంబాన్ని తన్ని తరిమేస్తే.. గుంటూరు జిల్లా వచ్చి రాజకీయం చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాజధానిలో బీసీలపై జరిగిన దాడి ముమ్మాటికి రాజకీయ హత్యేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఓట్లు వెయ్యం అన్న పాపానికి తెలుగుదేశం నాయకులు రాజధానిలో బీసీలను కారుతో గుద్ది చంపేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును రూపుమాపడానికి జయదేవ్ ప్రయత్నం చేస్తున్నాడని.. దీని వెనక అతని హస్తం కూడా ఉనట్లు శ్రీనివాస్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. -
నాలుగు స్థానాల్లో అభ్యర్థుల మార్పు
టీడీపీ ఆరో జాబితా విడుదల సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతల తీవ్రస్థాయి నిరసనలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగు స్థానాల్లో చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థులను మార్చారు. స్థానికేతరులకు టికెట్లివ్వడంతో స్థానిక నేతల నుంచి నిరసనలు తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చక తప్పలేదు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గానికి తులసీ రామచంద్రప్రభు పేర్లు తొలుత ప్రకటించారు. వారిద్దరూ స్థానికేతరులు కావటంతో నిరసన వ్యక్తమైంది. దీంతో మాచర్ల నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డి, మంగళగిరి నుంచి జి. చిరంజీవిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక విశాఖపట్నం జిల్లా అరకు స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన కుంభా రవిబాబు పేరు ప్రకటించారు. ఆయన్ను తప్పించి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే సివిరి సోమ (చంద్రమ్మ)కు కేటాయించారు. అనంతపురం జిల్లా శింగనమల సీటుకు తొలుత బండా రవికుమార్ పేరును ప్రకటించారు. అయితే ఆయనకు బదులు ఎమ్మెల్సీ శమంతకమణి కుమార్తె పామిడి యామినిబాలను బరిలో దించారు. ఇదిలా ఉంటే పార్టీ అభ్యర్థుల ఆరో జాబితాను శుక్రవారం విడుదల చేశారు. గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీటును కేటాయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నెల్లూరు జిల్లా సర్వేపల్లి, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు పెద్దాపురం, పోతుల విశ్వంకు పిఠాపురం, ప్రభాకరచౌదరికి అనంతపురం సీట్లను కేటాయించారు. దీంతో 160 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. బీజేపీ నుంచి వెనక్కి తీసుకున్న ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్ పోటీచేస్తారు. రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.