breaking news
big leaders
-
దారులెన్నో
వీళ్లంతా బడా ‘బాబు’లండీ...! ‘పచ్చ’ దనం ’తెల్ల’బోతోంది నల్లధనానికి కొత్త రూపులు బడా బాబులు ఎందుకు బయటకు రావడం లేదో... మరి కోట్లు కూడబెట్టిన బడా బాబులు ఏం చేస్తున్నట్టు.? విత్‌డ్రా చేసుకున్నట్టు, డిపాజిట్ చేస్తున్నట్టు ఈ సోకాల్డ్ బాబులు ఈ మూడు రోజుల్లో జిల్లాలో ఏ బ్యాంకు కౌంటర్లోనూ దర్శనమివ్వడం లేదంటే ఏమనుకోవాలి, డిపాజిట్‌కు డిసెంబరు నెలాఖరువరకు గడువు ఉందనే ధీమా అంటారా, వారికి డబ్బు అవసరం లేదనుకోవాలా. బినామీలతో విత్‌డ్రా చేయిస్తున్నారనుకోవాలా. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల్లలో ప్రభుత్వ పథకాలపై పడి ఎడాపెడా దోచుకున్నంతా దోచుకుని దాచుకున్న నేతలంతా ఇప్పుడు వాటిని మార్చుకునే పనిలో పడ్డారని ఆ వర్గాల్లోనే గుసగుసలు వినుపిస్తున్నాయి. – లక్కింశెట్టి శ్రీనివాసరావు డబ్బు...డబ్బు...డబ్బు...ఎక్కడ చూసినా...ఏ ఒక్కరిని పలుకరించినా జిల్లాలో మూడు రోజులుగా ఇదే చర్చ. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో దాదాపు అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. బ్యాంకుల్లో చూస్తే సరిపడా నగదు లేదంటున్నారు. ఏటీఎంలకు వెళితే నగదు నిండుకుందనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సామాన్య జనం తిట్టుకుని వెనుతిరుగుతున్నారు. బ్యాంకులు తెచ్చిన కొత్త నోట్లు అరకొరగానే అందుబాటులోకి రావడంతో సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు, రైతులు దైనందిన జీవనంలో నరకం చూస్తున్నారు. బ్యాంకులు నిర్ణయించిన నగదు విత్ డ్రా (రోజుకు రూ.2000లు) కోసం ఈ వర్గాలే క్యూలైన్లలో కనిపిస్తున్నాయి. సమాజంలో డబ్బు వీరికి మాత్రమే అవసరమా. బ్యాంకు, ఏటీఎం వద్ద చూసినా ఈ రెండు వర్గాలే కనిపిస్తున్నాయి. తెల్లగా చేసేందుకు దేవుడి సన్నిధిలో తమ్ముడి పాట్లు... ఖజానా గుప్పెట్లో ఉన్న ఒక పెద్దన్న కూడబెట్టిన కోట్లు సర్థే పని అతని సోదరుడికి పురమాయించాడు. ఆ సోదరుడు అన్న మాట జవదాటకుండా‡ అన్ని పనులూ పక్కనపెట్టేసి ఇప్పుడు దగ్గరుండి నల్లధనాన్ని తెల్లగా చేసే వ్యవహారం చూసుకుంటున్నారట. కొండలపై కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని ఇందుకు అడ్డాగా మార్చుకున్నారని భక్తజనం ఆవేదన. ఆ పుణ్యక్షేత్రంలో రెండున్నరేళ్లుగా తన కనుసన్నల్లో నడుస్తున్న కొందరు వ్యాపారులను ఇందుకు పక్కాగా వినియోగించుకున్నారు. వారంతా దేవస్థానానికి జమచేసే సొమ్ములు, ఆలయ కౌంటర్లకు భక్తుల నుంచి వచ్చిన తెల్లనోట్లను తీసుకుని వాటి స్థానంలో అన్నగారి అక్రమార్జనలో కొంత నల్లడబ్బు అరకోటికిపైనే చక్కగా సర్థేశారని కృష్ణానగర్ టాక్. ఇటు కోనసీమ కేంద్రంలో సామాన్య కార్యకర్త నుంచి చాలా తక్కువ సమయంలోనే ఎకాఎకిన నియోజకవర్గ ముఖ్యుడిగా ఎదిగిన నాయకుడాయన. ఆ నాయకుడు కూడా తన దారికి అడ్డే లేదనే తెగింపు కాస్త ఎక్కువనే చెప్పాలి. తనకంటే బాగా సీనియర్, రక్షక భటులను గడగడలాడించే ఆ నాయకుడు అండదండలు ఎలానూ ఉన్నాయి. ఇంకేముంది తన దారికి అడ్డు లేదని నిశ్చింతగా దోచుకున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చే పనిలో బిజీగా ఉన్నారని అమలాపురంలో బలమైన నోటిమాట నడుస్తోంది. బినామీలుగా ఉన్న అరడజను మంది ప్రధానమైన అనుచరులతో డబ్బు మార్పిడి చేస్తున్నారట. కోనసీమ కేంద్రంలో ఆక్వా రంగ ప్రముఖుల ద్వారా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే పనిలో పడ్డారు. కొంత సొమ్మునైతే తన బంధువర్గం వారితో బ్యాంకుల్లో రెండున్నర లక్షలు వంతున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించారు. ఇలా ముందు జాగ్రత్తగా.. ఈస్ట్ర¯ŒS డెల్టా పరిధిలో ఉన్న ముగ్గురు నియోజకవర్గ ముఖ్యనేతల్లో ఇద్దరు మాత్రం బంధువుల పేరుతో నడుస్తున్న రైస్ మిల్లింగ్, ఆయిల్ మిల్స్ లావాదేవీల ద్వారా నల్లడబ్బు ఇప్పటికే చక్కబెట్టేశారట. అందుకే ఏమీ బాదరాబందీ లేనట్టుగా నిశ్చింతగా ఉన్నారంటున్నారు. మరో నియోజకవర్గ ముఖ్యనేతైతే జిల్లాతోపాటు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రియల్టర్ల ద్వారా సర్థుబాటు చేసుకునే పనిలో ఉన్నారట. గత నెలలో తనకు తాను అపర భగీరధుడుగా కీర్తించుకున్న మరో నియోజకవర్గ ముఖ్యనేత ‘అసలు ఈ నల్లధనంతో తనకు సంబంధం లేనట్టు, తన వద్ద అటువంటి పాపపు సొమ్ము లేదన్నట్టు’ ఫోజు పెడుతున్నాడు. అంతలా ధైర్యంగా ఉండటానికి కారణమేమిటా అని ఆరా తీస్తే అక్రమార్జనలో సింహభాగం రియల్ ఎస్టేట్, కనస్ట్రక్ష¯ŒS వ్యాపారంలోనే ఉందట. లిక్విడ్ కేస్ అంతా నాలుగు నెలల క్రితమే ఆ రంగానికి బదిలీ చేశారట. పోర్టు సిటీలో కలిసిమెలిసి ఉన్న రెండు నియోజక వర్గాల ముఖ్య నేతల్లో ఒక నేత నల్లధనం భారీగానే కూడబెట్టాడు. అది ఎలా మార్చాలా అన్న దానిపై తర్జనభర్జనల అనంతరం ఆ సొమ్ము అంతటినీ తన నియోజకవర్గంలో రియల్టర్లకు అప్పగించారు. మరో నియోజకవర్గ నాయకుడైతే తన సోదరుడు అదంతా చక్కబెట్టేస్తుండటంతో హ్యాపీగా ఉన్నారట. ఆ నల్లధనానికి సోదరుడు సముద్ర ఉత్పత్తుల వ్యాపారంలోకి మళ్లించే పనిలో ఉన్నారని తీరంలో తాజా కబురు. రాజమహేంద్రవరంలో ఉన్న మరో ముఖ్యనేత అక్రమార్జనను తాను పెంచి పోషించగా కార్పొరేష¯ŒSలో చక్రం తిప్పుతున్న నాయకుడి ద్వారా దారి మళ్లిస్తున్నారని గుసగుసలు జోరందుకున్నాయి. కొంత మాత్రం తన నుంచి దూరమైన సోదరుడి వ్యాపారంలో పెట్టే ప్రయత్నాల్లో బిజీ అయ్యారట. జిల్లాలో ఒక ముఖ్యనేత ఫో¯ŒSచేసి నల్లడబ్బుకు సేఫ్ ప్లేస్ చెప్పమని అడగటంతో నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి కంగుతిన్నారట. -
పెద్ద నాయకుల రాజకీయ కళ
జాతిహితం వియన్నాలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జాన్ ఎఫ్. కెన్నడీ వ్యాఖ్యనొకదాన్ని ఉల్లేఖించారు. ‘‘భయం కారణంగా ఎన్నడూ చర్చలకు దిగొద్దు, చర్చలంటే ఎన్న డూ భయపడొద్దు’’ అనే ఆ వ్యాఖ్య ఒబామా రెండు దఫాల అధ్యక్ష కాలాన్ని నిర్వచిస్తుంది. ఒత్తిడుల వల్ల సాధించలేని దాన్ని ఓపికగా నిర్వహించిన దౌత్యంతో చివరికి సాధించామని ఆయన అన్నారు. అదే అభి ప్రాయాన్ని ప్రతిధ్వనించేలా ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావెద్ జారిఫ్ కూడా పదేళ్ల అమెరికా ఒత్తిడి సాధించలేనిదాన్ని రెండేళ్ల దౌత్యం సాధించిందని చెప్పారు. మన రిపబ్లిక్ డే సందర్భంగా ఒబామా రావడానికి ముందు ‘ఇండియా టుడే’ పత్రిక (2014 నవంబర్ 27) ‘జాతిహితం’లో ‘‘రాజ్‌పథ్ వద్ద ఒబామా: సెల్ఫీ తీసుకునే మరో సందర్భం మాత్రమే కాదు’’ అనే శీర్షిక తో నేనో వ్యాసం రాశాను. ప్రస్తుతం ఒబామా సమస్య లతో తలమునకలవుతున్న స్థితిలో ఉండవచ్చు. కానీ చరిత్ర బహుశా ఆయనను ఇంతకంటే మరింత ఎక్కువ న్యాయంగానూ, పాత్రికేయుల కంటే మరింత ఎక్కువ ప్రశంసాపూర్వకంగానూ తీర్పు చెప్పొచ్చునని చెప్పాను. నా మాటలను ఇప్పుడాయన గురికి సుదూరమైన అంచనాను చేసేశారు. ఒక్క బెంజమిన్ నెతన్యాహూ తప్ప ప్రపంచమంతా మెచ్చిన ఆ ఒప్పందానికి కారణం ఆయన చూపిన పట్టుదల, ధైర్యమే. ఒప్పందాన్ని అడ్డగించాలని అమెరికా కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రయ త్నం జరిగినా వీటో హక్కును ప్రయోగిస్తానని అస్ప ష్టతకు తావేలేకుండా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వినూత్న స్వరంతో చేసిన బెదిరింపులో ఆయన దృఢసంకల్పం వ్యక్తమైంది. ఈ ఒప్పందం ఫలితంగా త్వరలోనే ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తారు. భారత్‌పై ఈ ఒప్పందం కలుగ జేసే ప్రభావాలు సానుకూలమైనవే. మన ఇంధన ఆర్థిక పరిస్థితిలో ఉపశమనం కలుగుతుంది. ఇరాన్‌ను మరిం త ప్రత్యక్ష పాత్రధారిని చేయడం పొరుగునున్న అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సమాజాలలో శాంతిని నెల కొల్పడానికి సహాయపడుతుంది. చివరికి అది గ్యాస్ పైపులైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయినా ఇరాన్-అమెరికా అణు ఒప్పందం నిజానికి ఈ వారం మన చర్చనీయాంశం కాదు. అందుకు బదులుగా ఇది మరింత పెద్ద, సంక్లిష్ట విషయానికి సంబంధించిన చర్చ. ఒక నాయకుడు తన కాలానికి సంబంధించిన పెద్ద లక్ష్యాలను ఎలా ఎంచుకుంటాడు, వాటిని సాధిం చే క్రమంలో వాస్తవంగా ఆ లక్ష్యాల సాధన నుంచి పెడదోవపట్టించే సమస్యలతో ఎలా వ్యవహరిస్తాడు, తన లక్ష్యాల సాధనకు అతడు తన రాజకీయ పెట్టుబడిని ఏ తీరున నియుక్తం చేస్తాడు అనే అంశాన్ని చర్చించబోతున్నాం. వ్యాపారవేత్తకు డబ్బు (ఫైనాన్స్) ఎలాంటి దో, ప్రజా నాయకునికి రాజకీయ పెట్టుబడి కూడా అలాంటిదే. మీరు ఎంత సంపన్నవంతులైనా కావచ్చు, కానీ పెట్టుబడిగా పెట్టడానికి మీ చేతిలో ఉండే డబ్బు ఎప్పుడూ పరిమితమైనదిగానే ఉంటుంది. మంచి వ్యాపారవేత్త దాన్ని తెలివిగా మదుపు చేస్తాడు. సరిగ్గా అదే రాజకీయవేత్తలకు కూడా వర్తిస్తుంది. ఇటీవలి కాలపు మన అనుభవాన్నే వెనక్కు తిరిగి ఒక్కసారి చూద్దాం. యూపీఏ-1 తన రాజకీయ పెట్టుబడిని సమంజసమైనంత తెలివిగానే ఉపయోగిం చింది. తమ వామపక్ష మద్దతుదార్లకు ఆందోళన కలిగించే ప్రమాదానికి అవకాశమున్న ప్రైవేటైజేషన్ వంటి సంస్కరణవాద డిమాండ్ల జోలికి పోకుండా ఉంది. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే సంసిద్ధతను భారత్-అమెరికా అణు ఒప్పందం వంటి పెద్ద సమ స్యలపై పోరాటం కోసం దాచుకుంది. ఆ పోరులో అది సాధించిన విజయం సుప్రసిద్ధమైనది కూడా. ఆ కీలక మలుపు ధృతే దాన్ని 2009లో రెండో దఫా అధికారం లోకి తీసుకువచ్చింది. ఒబామా ఏం చేశారో చూడండి. ఇరాన్‌తో అణు వివాదాల పరిష్కారం, క్యూబాతో సాధారణ సంబం ధాలను నెలకొల్పుకోవడం, దేశీయంగా ‘ఒబామా హెల్త్ కేర్’ అనే పెద్ద లక్ష్యాలను ఆయన చాలా ముందు గానే ఎంచుకున్నారు. ఇలా తన మార్గాన్ని నిర్దేశించు కున్నాక, ఆ మార్గం నుంచి పెడదోవ పట్టించే అప్పటికే ఉన్న ఇరాక్, అఫ్ఘానిస్థాన్ సమస్యల నుంచి బయట పడటం ప్రారంభించారు. ఉక్రెయిన్ సమస్యకొస్తే, అది ఎంతటి రెచ్చగొట్టే విషయమైనా సాధారణంగా ఆయన దానికి దూరంగానే ఉన్నారు. ఇక ఉత్తర కొరియాను ఆయన ఏమంత ఘనమైనదేమీకాని దాని స్వయం ప్రకటిత ఏకాంత వాసానికే వదిలేశారు. ఈ విషయాన్ని మరింత లోతుగా విశ్లేషించడం అవసరం. ఉక్రెయిన్ సమస్య, మౌలికమైన పాత సమ స్యలతోనూ, నాటో దానితో కుదుర్చుకుందామనుకున్న ఒప్పందం గురించిన భయాలతోనూ ముడిపడిన సమ స్య. కానీ అలసిపోయి, క్షీణిస్తున్న అమెరికాకు వ్లాదిమిర్ పుతిన్ తన అత్యాశలను అదుపులో పెట్టుకునేలా చేయడానికి అవసరమైన నిర్ణయాత్మక శక్తి లేదు. అందు కే ఇప్పటికైతే ఆయన చేయగలిగినది... ఆ సమస్యకు దూరంగా ఉంటూనే దానితో వ్యవహరించడం లేదా పొరుగు యూరోపియన్ దేశాలకు దాన్ని వదిలేయడం మాత్రమే. మరీ ముఖ్యంగా, ఐఎస్ఐఎస్ మారణకాం డల విషయంలో, ప్రత్యేకించి టెలివిజన్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ అమెరికన్ల తలలను నరకడం వంటి తీవ్ర కవ్వింపు చర్య తర్వాత కూడా ఆయన నిగ్రహం కోల్పోలేదు. మామూలు నాయకులైతే అలాంటి కవ్విం పు చర్యలకు, రేగిన గగ్గోలుకు, ప్రజల్లో విస్తృత ప్రాచు ర్యం పొందిన డిమాండ్లకు వెంటనే ప్రతిస్పందిస్తారు. 2013లో పాకిస్తానీయులు ఒక భారత సైనికుని తలను నరికేయడం జరిగిన తర్వాత యూపీఏ-2 నాటి ప్రజా భిప్రాయాన్ని శాంతింపజేయడానికి పూనుకొని, అప్పు డే మొదలైన పాకిస్తాన్‌తో సాధారణ పరిస్థితుల పున రుద్ధరణ క్రమాన్ని తిరుగుముఖం పట్టించింది. రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉండటంలో అమెరికా సమాజం మన సమాజం కంటే తక్కువేమీ కాదు. అక్కడి మితవాద పక్ష యుద్ధోన్మాదం తీవ్రమైనది. ఇక ‘ఫాక్స్ న్యూస్’ చేసే రభస మనకు ఊహింపశక్యం కానంతటి స్థాయిది. అయినా ఒబామా మాత్రం మరి కొన్ని బాంబు దాడులకు మించి మరేమీ చేసింది లేదు. ఐఎస్ఐఎస్తో పోరాడే పనినంతటినీ అసమర్థ ఇరాకీ లకు, చెల్లాచెదురై ఉన్న సిరియన్లకు, తెగించి పోరాడు తున్న కుర్దులకు వదిలేశారు. ఆయన లక్ష్యం ఇరాన్. ఆ విషయాన్ని బెంజమిన్ నెతన్యాహూ కంటే ఎక్కువ త్వరగా గ్రహించినవారు లేరు. అమెరికా అంతర్గత రాజకీయాలను వాడుకొని ఆయన ఆ ఒప్పందాన్ని అడ్డగించడమే తన కార్య క్రమంగా మార్చుకున్నారు. ఒబామా సమ్మతిలేకున్నా అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించడానికి ఆహ్వా నాన్ని సైతం ఆయన సంపాదించగలిగారు. పైగా అమెరికా అధ్యక్షుణ్ని గురిగా చేసుకొని మరీ ఆయన తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాకు ఇజ్రాయెల్లాగా, భారత్‌కు అలాంటి మిత్రదేశం లేదు. అలాంటి దేశమేదైనా ఉండి ఉంటే, అది భారత ప్రధాని విషయంలో ఇలా చేస్తే మనం దాన్ని ఎలాంటి వ్యక్తిగత , జాతీయ అవమానంగా చూసి ఉండేవారమో ఊహించండి. కానీ ఒబామా తన రాజకీయ పెట్టుబడిని ఇలాంటి విషయాలపై ప్రతిస్పం దించడం కోసం వెదజల్లదలుచుకోలేదు. ఆయన రెండు పెద్ద నిర్ణయాలను తీసుకు న్నట్టనిపిస్తుంది. ఒకటి, ఉత్తర కొరియా విషయంలో వ్యర్థంగా కృషి చేయడం కంటే పొరుగు దేశమైన క్యూబాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకో వడం సుసాధ్యమూ, లాభదాయకమూ అనేది. రెండు, మధ్య ప్రాచ్యంలోని అతిపెద్ద, అత్యంత సుస్థిర శక్తి అయిన ఇరాన్‌ను తమ శిబిరంలోకి తీసుకురావడం... ఆ ప్రాంతంలో నెలకొన్న అరాచక పరిస్థితులలో మౌలికమైన, సానుకూల మార్పును సాధించడంలో కీలకమైనదని గుర్తించడం. మేధోపరంగా చూస్తే, చమురు ధరలలోని భారీ పెరుగుదలే మధ్యప్రాచ్యం లోని విధానపరమైన ఉన్మాదానికి, నియంతృత్వం దిశగా సహజ ప్రేరణకు చాలా వరకు కారణం. అందు వల్లనే ఒబామా తన ఉదారవాద మద్దతుదార్లకు చికాకు కలిగించే ముప్పు ఉన్నా, షేల్‌గ్యాస్ వెలికితీత కోసం ఫ్రాకింగ్ ప్రక్రియకు అనుమతులను కొనసాగించారు. ఇరాన్‌ను మెత్తబరచే కీలకమైన మీటగా ఆయన అనైతి కమైన దక్షిణ డకోటా షేల్ గ్యాస్ నిల్వలను ప్రయోగిం చారనడం అతిశయోక్తి కాదు. చమురు ధరలు పడిపో యే కొద్దీ ఇరాన్‌కున్న ఆంక్షలను తట్టుకుని నిలిచే శక్తి కూడా క్షీణించింది. ఇప్పటికీ అక్కడ ఉన్నది మతపెద్దల నియంతృత్వమే. అయినా, ఆ ప్రాంతంలోని మరే ఇతర పెద్ద దేశం కంటే ఆ దేశ ప్రజలలోనే బలమైన సహజ తార్కిక గుణం ఉంది. పైగా పరిమిత అధికారాలతోనే అయినా అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉంది. అదేమీ సౌదీ అరేబియానో, ఇరాకో లేదా సిరియానో కాదు. సున్నీ ఐఎస్ఐఎస్ విస్తరణను తిప్పికొట్టే విషయంలో ఇరాన్ అత్యుత్తమ స్థానంలో ఉంది కూడా. ఈ వారంలో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఒబామా ‘‘న్యూయార్క్ టైమ్స్’’కు చెందిన టామ్ ఫ్రీడ్ మన్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘వారు మీ శత్రు వులు, మీ ప్రత్యర్థ్థులే అయినాగానీ అప్పుడప్పుడూ వారి స్థానంలోకి ప్రవేశించాల్సిన సామర్థ్యం మీకుం డాలని నేనూ భావిస్తాను’’ అంటూ ఆయన చేసిన ఒక్క వ్యాఖ్యే ప్రత్యేకించి ఎంతో చెబుతుంది. గత వారంలో జరిగిన మరో రెండు అంతర్జా తీయ పరిణామాలను ఈ సందర్భంగా ప్రస్తావిం చడం అవసరం. యూరప్ కలిసికట్టుగా నిలిచింది. వామపక్షవాదులు కఠినమైన బెయిల్అవుట్ను అంగీ కరించారు. అది గ్రీస్‌ను యూరోపియన్ యూని యన్లోనే ఉంచుతుంది. ప్రజాభిప్రాయసేకరణలో గ్రీస్ ప్రజలు సరిగ్గా దీనికి వ్యతిరేకమైన దాన్ని కోరు తూనే తిరుగు లేని తీర్పును చెప్పారు. ఈ సందర్భం గా తన రాజకీయ ఆధిపత్యాన్ని, పెట్టుబడిని పొదుపు చేసుకున్నది జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్. ఆమె విజేతగా నిలిచారు. మరింతగా ఆమె యూరోపియన్ నాయకురాలయ్యారు. గ్రీస్‌కు చెందిన అలెక్సిస్ సిప్రాస్, ఇక్కడ మన కేజ్రీవాల్‌లాగే అంతటి జనా కర్షకవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వారు. అయితే ఆయన చివరకు దేశానికి లబ్ధి చేకూ రడమన్న స్థూల దృశ్యాన్ని దర్శించగలిగారు. ప్రజా భిప్రాయసేకరణను ఆయన బేరసారాలు సాగించే సాధ నంగా ఉపయోగించుకున్నారు. ఇక రెండవది, మన ప్రధాని నరేంద్ర మోదీ ఉఫాలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో జరిపిన సమావేశం. చాలామంది, ప్రత్యేకించి మోదీకి మరింత విధే యులు, బహిరంగ మద్దతుదారులు పాకిస్తాన్ పట్ల ఆయన తన ‘కఠిన’ వైఖరిని కొనసాగిస్తారని ఆశించారు. కానీ ఆయన కాంగ్రెస్ తరహా చర్చలు- చర్చలే, పోరాటం-పోరాటమే (చైర్మన్ మావోకు క్షమాపణలతో) అనే వైఖరిని తిరిగి చేపట్టడం చూసి విస్తుపోయారు. అందువల్లనే మోదీ అధికార వ్యవస్థలోని పలువురు దీన్ని పాకిస్తాన్‌కు లోబడి పోవడం లాంటిదిగా ప్రచారం చేస్తూ, కశ్మీర్ సమ స్యను ప్రస్తావించకపోవడం వంటి అంశాలను చూపు తున్నారు. సర్తాజ్ అజీజ్ దాదాపు తక్షణమే స్పందిం చారు. అయితే పరిస్థితి ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోం ది. సదరు ప్రభుత్వ ప్రతినిధి ఇప్పుడు ఉమ్మడి ప్రకటనలో రాసి ఉన్న మాటలే లెక్కలోకి వస్తాయి గానీ, ఏం మాట్లాడారనేది కాదనే వ్యాఖ్యతో గిరికీ కొట్టి, తమ ముందటి వ్యాఖ్యను కొట్టిపారేశారు. అయితే ఒక కీలకమైన ప్రశ్నకు ఇంకా సమాధానం కావాల్సి ఉంది. ఇరాన్, క్యూబాల విషయంలో ఒబామా, గ్రీస్ విషయంలో కొంతవరకు మర్కెల్ చేపట్టిన వైఖరిని మనం వివరంగానే చూశాం. దాన్ని బట్టి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం, విజయవంతమైనవిగా వాటిని తామెలా చూస్త్తారో అలా నిర్వచించడం పెద్ద నాయకుల పని. భారత్-పాకిస్తాన్ల నేపథ్యంలో, అది ఒకప్పుడు సుష్మా స్వరాజ్ అన్నట్టు ఒక తలకు పది తలలా లేక రాజ్‌నాథ్‌సింగ్ బీఎస్ఎఫ్ జవాన్లకు ఇప్పుడు చెబుతున్నట్టు ఒకరికి ఐదుగురిని చంపడమా? లేదంటే పాకిస్తాన్‌ను చర్చలు, సంప్రదింపుల దారికి వచ్చేలా చేయడమా? నరేంద్ర మోదీ ఎంచుకోవాల్సి ఉంది. రెండవదాన్నే ఆయన ఎంచుకునేట్టయితే, ఆ లక్ష్య సాధన కోసమే ముందుకు సాగుతూ ఉండాలి. ఎత్తుగడలపరమైన పెడదోవ పట్టించే సమస్యలను విస్మరించి, పెద్ద నిర్ణయాల కోసం ఆయన తన రాజకీయ పెట్టుబడిని దాచుకోవాలి. మోదీకి ప్రజల నుంచి లభించిన తీర్పు, ఆయన భావజాలమూ కలసి మరే భారత నాయకునికి ఎన్నడూ లేని విధంగా... మన దేశాన్ని అత్యంత బలహీనపరిచే విదేశాంగ విధానపరమైన సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్నిచ్చాయి. తద్వారా ఆయన రోనాల్డ్ రేగన్, మెనాచెమ్ బెగిన్లలా మితవాద పక్ష శాంతిసంధాతగా ఎదగవచ్చు లేదా తన మిత్రుడు బరాక్ ఒబామా బాటను సైతం అనుసరించవచ్చు. - శేఖర్ గుప్తా