breaking news
Bhairavi Goswami
-
నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!
ముంబయి: బాడీ షేమింగ్ వివాదంలో నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాకిచ్చింది కృతి సనన్. 'నాపై భైరవి గోస్వామి కామెంట్ చేసిందని తెలిసింది. అయితే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి' అంటూ మీడియాను నటి కృతిసనన్ అడిగారు. మీపై తీవ్ర విమర్శలు చేసిన భైరవి గోస్వామి 'హేట్ స్టోరీ' మూవీలో నటించారని చెప్పగానే కృతి కాస్త ఆశ్చర్యానికి లోనైంది. 'ఇప్పటివరకూ ఆమె ఎవరో కూడా ఎంతో మందికి తెలియదు. నాపై విమర్శలు చేయడంతోనైనా ఆమె నటి అని చాలా మందికి తెలిసింది. నాపై విమర్శలతోనైనా ఆమె పాపులర్ అయ్యారు. ఆమెను కూడా గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీ విమర్శకుడు కేఆర్కే మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని' కృతి అభిప్రాయపడ్డారు. అసలు వివాదం ఏంటంటే..! అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ చేసిన వీడియోను కృతిసనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆమె నటించిన రాబ్తా మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు మానసిక స్థితి బాలేదని కేఆర్కే ట్వీట్ చేయగా, అసలు కృతి నటి ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కనీసం ఆమె కాలేజీ స్టూడెంట్ లాగ కూడా కనిపించదంటూ మరో నటి భైరవి గోస్వామి కామెంట్ చేసింది. మూవీ ఛాన్స్ ల కోసం, తనను తాను ప్రమోట్ చేసుకోవాలని భైరవి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. -
వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు
ముంబయి: నటి కృతి సనన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు కారణం.. అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రమోట్ చేయడమే. తొలుత బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే స్పందించాడు. కృతిసనన్ నటించిన రాబ్తా ఫ్లాఫ్ కావడంతో నటి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆమె ఇలా పిచ్చి గంతులు వేస్తున్నారని కేఆర్కే ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటి భైరవి గోస్వామి తోటి నటిగా కృతికి మద్ధతు తెలపడం బదులుగా దారుణంగా విమర్శించింది. ‘రాబ్తా ఫ్లాప్ అవడంతో కృతి పిచ్చిదానిలా తయారైంది. అసలు ఆమె హీరోయిన్ ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కాలేజీ విద్యార్థినులు ఆమె కంటే చాలా బెటర్‌గా కనిపిస్తారంటూ’ భైరవి ట్వీట్ చేసింది. అవకాశాల్లేక వేరే నటిని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరికాదంటూ భైరవిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భైరవి చివరగా ‘హేట్ స్టోరీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.