వైజాగ్లో ఆయూష్ యూనివర్శిటీ
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రెండు జిల్లాల్లో నేచర్ క్యూర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో జిల్లా వైద్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కామినేని శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ... వైజాగ్లో ఆయుష్ యూనివర్శిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
అలాగే గుడివాడ, రాజమండ్రి, కడప, విజయవాడ నగరాల్లో పీజీ మెడికల్ సీట్లు పెంచుతామన్నారు. పుట్టపర్తిలో 100 పడకల నేచర్ క్యూర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని తెలిపారు.