breaking news
Australian Open squash tournament
-
జోష్న పరాజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ క్వార్టర్ఫైనల్లో జోష్న చినప్పకు పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ ఆనీ ఔ (హాం కాంగ్) చేతిలో ఆమె 7-11, 4-11, 8-11 తే డాతో చిత్తయ్యింది. కేవలం 34 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరో సీడ్ జోష్న ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. -
క్వార్టర్స్‌లో జోష్న
మెల్బోర్న్ : భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన పోరులో జోష్న 5-11, 11-6, 11-6, 11-8 తేడాతో మేగన్ క్రెయిగ్ (కివీస్)ను ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో ఈ తమిళనాడు స్టార్‌కు టాప్ సీడ్ అనీ ఔ (హాంకాంగ్)తో గట్టి పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగం రెండో రౌండ్లో హరీందర్ సింగ్ 4-11, 11-7, 4-11, 15-13, 9-11తో నఫిజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై, మహేష్ మంగావ్కర్ 11-7, 11-4, 9-11, 9-11, 7-11 తేడాతో స్టీవ్ పినిస్టిక్ (ఆసీస్)పై పోరాడి ఓడారు.