breaking news
Aloe
-
కాలాన్ని కవర్ చేద్దాం
ఎండవేడిమి చర్మం, శిరోజాల మీద అధిక ప్రభావం చూపుతుంది. విరుగుడుగా మనమే కొన్ని జాగ్రత్తలను పాటించి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండకాలం తీవ్రతను కవర్ చేసేయొచ్చు. కమిలిన చర్మానికి కలబంద ఎండకు కమిలిన చర్మానికి కలబంద మంచి ఉపశమనం ఇస్తుంది. కలబంద రసాన్ని ఐస్‌ట్రేలో పోసి ప్రీజర్‌లో సిద్ధంగా ఉంచాలి. కలబంద క్యూబ్‌తో కమిలిన చర్మం మీద మృదువుగా రబ్ చేయాలి. ఇది వెంటనే రిలీఫ్ ఇవ్వడంతో పాటు ట్యాన్ తగ్గిస్తుంది. తాజాదనానికి రోజ్‌వాటర్ ఇంట్లో రోజ్‌వాటర్‌ని ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దూది ఉండను చల్లని రోజ్‌వాటర్‌లో ముంచి, దాంతో ముఖమంతా తుడవండి. కళ్ల చుట్టూ మరోమారు తుడవాలి. దీంతో మీకు అలసట తీరిపోయి ఫ్రెష్‌గా కనిపిస్తారు. పొడి జుట్టుకు తేనె తేనె, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. జుట్టుకు, మాడుకు పట్టించాలి. షవర్క్యాప్తో జుట్టునంతా కవర్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పొడిజుట్టుకు మంచి కండిషనింగ్ లభిస్తుంది. కాలిమడమలకు సముద్రపు ఉప్పు బంగాళదుంపను సగానికి కట్ చేసి, దానిని ఉప్పుతో రుద్ది కాలి మడమల భాగంలో రబ్ చేయాలి. తర్వాత వాజెలిన్ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేయాలి. కొన్నిరోజుల్లోనే మీ పాదాల పగుళ్లు తగ్గి, చర్మం మృదువుగా అవుతుంది. చిట్లిన వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్ వేసవిలో స్విమ్మింగ్ చేసేవారికి తలవెంట్రుకులు బాగా పొడిబారడం, చిట్లడం వంటì సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి విరుగుడుగా.. స్విమ్మింగ్ చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల కండిషన్ దెబ్బతినదు. జుట్టు దురద పెడుతుంటే చల్లటి పెరుగును జుట్టుకు పట్టించి 10 నిమిషాలు సేదదీరండి. తర్వాత శుభ్రపరుచుకోండి. దురద తగ్గడమే కాకుండా జుట్టుకు పెరుగు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. -
కుదుళ్లకు కలబంద
బ్యూటిప్స్ కలబంద జిగురులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. ఆపైన టవల్ చుట్టేసి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే కుదుళ్లు బలపడి, జుత్తు రాలడం ఆగిపోతుంది. రెండు కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇందులో రెండు చెంచాల తేనె, మూడు చెంచాల ఆలివ్ ఆయిల్, ఒక చెంచాడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని మాడుకు, జుత్తుకు బాగా పట్టించి, గంట తర్వాత తలంటుకోవాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో అరచెంచాడు లవంగాల పొడి, కొద్దిగా చిదిమిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసి బాగా మరిగించాలి. చల్లారాక మాడుకు, జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... జుత్తు రాలడం ఆగిపోవడమే కాక కుదుళ్లు గట్టిపడతాయి. -
మందులతో ఎత్తు పెరగవచ్చా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఆలోస్ అనే మొక్క నుంచి తయారు చేసిన ఎన్నో రకాల మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కలబంద మొక్కకు సంబంధించినవేనా? ఆయుర్వేదంలో దీని వివరాలు ఉన్నాయా? - పేరి విజయలక్ష్మి, విశాఖపట్నం ఇంగ్లిష్‌లో ‘అలోవెరా’ అనే జాతికి చెందిన ఈ కలబంద మొక్కకు సంబంధించిన ఎన్నో ఔషధగుణాలను, ప్రయోగాలను ఆయుర్వేదం వివరించింది. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయ పదాలున్నాయి. ఉదా: కుమారి, గృహకన్యా, దీర్ఘపత్రికా, తరుణీ, అమరా, అజరా మొదలైనవి. కలబంద గురించి భావిమిశ్రుడు చెప్పిన శ్లోకం ‘‘... కుమారీ భేదనీ శీతా తిక్తానేత్య్రా రసాయనీ, మధురా బృంహాణీ... గుల్మప్లీహ యకృత్వృద్ధి, కఫజ్వరా హరీ హరేత్... బల్యా వృష్యావాత విషహరీ...’’ కలబందకు దళసరిగా ఉండే పొడవైన మట్టలుంటాయి. వీటి చుట్టూ ముళ్లుంటాయి. ఆకు లోపల నెయ్యిలాంటి జిగురు పదార్థముంటుంది. ఈ రసంతోనే ముసాంబరాన్ని తయారు చేస్తారు. దీని గుజ్జు తిక్తమధురరసయుక్తంగా (చేదు, తీపి సమ్మేళనంగా) ఉంటుంది. ఔషధ గుణాలు : దీని రసాన్ని చర్మంపై పూస్తే చాలా రకాల చర్మరోగాలు తగ్గిపోతాయి. కొంచెం వెన్నతో కలిపిరాస్తే, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మకాంతి పెంపొంది ముఖసౌందర్యం శోభిస్తుంది. ఆ ఆకులను వేడిచేసి, రసం తీసి కాలిన వ్రణాలపై లేపనం చేస్తే నొప్పి తగ్గి, త్వరగా మానిపోతాయి. దెబ్బలు తగిలిన ప్రదేశంలో ఈ గుజ్జును ఉడికించి కడితే సెగ్గడ్డలు తగ్గుతాయి. ఈ గుజ్జును లేదా కలబంద వేరును నూరి పసుపుతో కలిపి పూస్తే మహిళల్లో రొమ్మువాపు తగ్గుతుంది. పన్నునొప్పితో పాటు దంతరోగాలూ తగ్గుతాయి. ఈ రసాన్ని గోరువెచ్చగా చేసి ఒకటి, రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గుతుంది. కడుపులోకి సేవిస్తే (మోతాదు పెద్దలకు నాలుగు చెంచాలు అంటే 20 మిల్లీలీటర్లు) కడుపుబ్బరం, మలబద్దకం, లివరు, స్ప్లీన్ వ్యాధులు, అర్శవ్యాధులు (పైల్స్), నులిపురుగులు తగ్గుతాయి. ఈ రసాన్ని చక్కెర, పాలతో కలిపి సేవిస్తే ధాతుపుష్టి, బలం కలిగి, ఆరోగ్యం బాగుపడుతుంది. శొంఠిపొడితో కలిపి సేవిస్తే ఎక్కిళ్లు, మిరియాలపొడి, తేనెతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. అధికబరువు, కీళ్లనొప్పులు, రుతుశూల (ముట్టునొప్పి), వడదెబ్బ వంటి వికారాలలో చక్కని గుణం కనిపిస్తుంది. కలబంద గుజ్జులో ఉప్పు వేసి ముద్దగా నూరి కట్టుకడితే కుక్కకాటుకు విరుగుడుగా పనికొస్తుంది. ఇది శరీరానికి చలవ చేస్తుంది. చాలారకాల జ్వరాలను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. దీని గుజ్జులో మెంతులపొడి కలిపి శిరోజాలకు పట్టించి, రాత్రంతా ఉంచి, మర్నాడు తలస్నానం చేస్తే... చుండ్రు, పేలు పోవడమే కాకుండా, శిరోజాలు దృఢంగా ఉండి, మృదువుగా నిగనిగలాడతాయి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నేను ఎత్తు పెరగడం లేదు. ఫ్రెండ్స్ మధ్యన పొట్టిగా కనిపిస్తున్నాను. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నేను ఎలాగైనా పొడువు పెరగాలని అనుకుంటున్నాను. ఎత్తు పెంచే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం వల్ల ఎత్తు పెరుగుతానా? నాకు దయచేసి తగిన సలహా ఇవ్వండి. - హుసేన్, కరీంనగర్ మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు తగినంత ఎత్తు పెరిగినట్లే లెక్క. మీకంటే చాలమంది పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి పొడవునకు సంబంధించిన జన్యువులు వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయం వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు ఇప్పటికే పద్ధెనిమిదేళ్లు దాటిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించకండి. అయితే కాళ్ల పొడువు పెంచే సర్జికల్ టెక్నిక్ అందుబాటులో ఉంది. దాన్ని ‘డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్’ అంటారు. ఇందులో ‘ఇలిజరోవ్ ఫిక్సేటర్స్’ అనే కొన్ని కృత్రిమ ఉపకరణాలను కాలిలో అమర్చుతారు. కానీ అలా పెంచే పొడవుతో కీళ్లనొప్పులూ, కండరం పటిష్టంగా లేకపోవడం, నరాలు దెబ్బతినడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పైగా ఇలా శస్త్రచికిత్సతో ఎత్తుపెంచడం అన్నది ఒక కాలి కంటే మరో కాలు పొట్టిగా ఉన్నప్పుడు ఆ రెండింటినీ సమంగా చేయడం కోసం మాత్రమే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎత్తు గురించి ఆందోళన పడకండి. ప్రకటనల్లో వచ్చేవన్నీ వాణిజ్యపరమైన ఉత్పాదనలే. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎత్తూ పెరగదు. ప్రకృతిపరంగా మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం మంచి హైటే. ఇప్పుడు మీరు మంచి కెరియర్ గురించి ఆలోచించండి. వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి. న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు పది రోజుల క్రితం నడుము మీద ఒక పక్క కురుపులు వచ్చాయి. తీవ్రమైన నొప్పి వచ్చింది. పది రోజుల తర్వాత అవి మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేనింత నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - మనోహర్‌రావు, ఆదిలాబాద్ మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఇది రావచ్చు. అప్పుడు కొన్ని యాంటీవైరల్ మందులు వాడటం వల్ల కురుపులు తగ్గిపోతాయి. అయితే మందు వాడని వారిలో కురుపులు మానిపోయాక ఇలా భరించలేని నొప్పులు వస్తాయి. అయితే ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. రెండు, మూడు రకాల మందులతో నొప్పిని నియంత్రించవచ్చు. మీరు వెంటనే డాక్టర్‌కు చూపించుకొని, మీ వయసును బట్టి, బరువును బట్టి తగిన మోతాదులో మందులు వాడటం వల్ల మీ నొప్పి తగ్గుతుంది. నా వయసు 30. నాకు ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో తలకు దెబ్బతగిలింది. అప్పుడు మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ప్రాక్చర్ అయినట్లుగా తెలిసింది. మెదడులో రక్తస్రావం కూడా అయింది. అప్పట్నుంచి ఏడాదికొకసారి ఫిట్స్ వస్తున్నాయి. నా సమస్య తగ్గే మార్గం చెప్పండి. - కిశోర్, ఇల్లందు మెదడుకు దెబ్బతగిలిన వారిలో, రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో ఆ కణాల నుంచి అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఫిట్స్ వస్తాయి. ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు చాలా సందర్భాలలో వారికి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బతగిలినప్పుడు, స్కానింగ్ చేయించినా ఆ రిపోర్టు నార్మల్‌గా ఉంటుంది. అలాంటివాళ్లలో కొన్ని నెలల పాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు న్యూరాలజిస్ట్‌కు చూపించుకొని, తగిన స్కానింగ్ చేయించుకోండి. ఆ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. -
అందం... కలబంద
బ్యూటిప్స్ కలబంద అందుబాటులో ఉంటే చాలు, చక్కని ముఖవర్చస్సు మీ సొంతమవుతుంది. ఎలాంటి చర్మానికైనా సరే కలబందతో తగిన ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్స్ మీ కోసం... రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల చీజ్, రెండు చెంచాల కీర దోసకాయల గుజ్జు, ఐదారు గింజలు తీసిన ఖర్జూరాలు మెత్తగా కలుపుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసాన్ని, చిటికెడు పసుపు చేర్చి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్న వాళ్లకు కళాకాంతులు వస్తాయి. రెండు తాజా కలబంద ఆకులను నీళ్లలో ఉడికించండి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి, రెండు చెంచాల తేనె, చిటికెడు గంధం పొడి కలపండి. దీనిని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది.