Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

APSDMA Warns Heavy Rains In Few Areas Of AP1
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

విశాఖ : రాబోవు ‍ కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

25 Meter Deep Crater At Israel Biggest Airport After Houthi Missile Strike2
వీడియో వైరల్‌.. ఇజ్రాయిల్‌పై హౌతీ క్షిపణి దాడి.. ఎయిర్‌పోర్టులో భారీ బిలం

హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్‌ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.🚨 HOUTHI MISSILE FROM YEMEN STRIKES BEN-GURION AIRPORT AREA, ONE LIGHTLY WOUNDED IN ATTACKFollowing sirens that sounded across several areas in Israel, the IDF Spokesperson confirmed that multiple attempts were made to intercept a missile launched from Yemen. Despite these… pic.twitter.com/I9D2srJc0x— Israel Realtime (@IsraelRealtime) May 4, 2025ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అలర్ట్‌..మరోవైపు, ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీన్‌కు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. టెల్‌ అవీవ్‌కు వెళ్లే విమాన సర్వీసులను అబుదాబికి మళ్లించింది. రెండు రోజల పాటు టెల్‌ అవీవ్‌కు సర్వీసులను రద్దు చేసింది. Absolutely INSANE footage of the impact from a Houthi missile on Israel’s Ben Gurion airport.What would happen if this was JFK or Heathrow - do you think the Houthis would exist tomorrow? How about their Iranian backers? pic.twitter.com/Qbv5BeGxWG— Aviva Klompas (@AvivaKlompas) May 4, 2025

India looking for partners, not preachers: Jaishankar3
మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్‌

న్యూఢిల్లీ: యూరోపియన్‌ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌ జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్‌. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.

PM Modi meeting With Air Force Chief Air Marshal Amar Preet Singh4
ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్‌ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.Indian Air Force Chief Air Marshal Amar Preet Singh is meeting Prime Minister Narendra Modi right now: Sources pic.twitter.com/qytnt88F0G— ANI (@ANI) May 4, 2025

Aaj Tak Wahaan Fielder Dekha hai kabhi: Dhoni Calls out Teammate5
అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?: ధోని ఫైర్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు శనివారం మరో చేదు అనుభవం ఎదురైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం రెండు పరుగుల తేడాతో ధోని సేన పరాజయం పాలై.. సీజన్‌లో తొమ్మిదో ఓటమిని నమోదు చేసింది.చెన్నై బౌలర్ల చెత్త ప్రదర్శన వల్ల బ్యాటర్ల మెరుపులు కూడా వృథా అయిపోయాయి. ముఖ్యంగా పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు.ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. కేవలం మూడు ఓవర్ల బౌలింగ్‌లోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. ఐపీఎల్‌తో పాటు ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఖలీల్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌గా పేరొందిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కూడా సహనం కోల్పోయాడు.ఓవైపు ఆర్సీబీ బ్యాటర్లు తమ బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. మరోవైపు ఖలీల్‌ ఏకాగ్రత లేకుండా ఫీల్డింగ్‌ చేయడం తలా కోపానికి కారణమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పదకొండో ఓవర్‌ను చెన్నై స్పిన్నర్‌ రవీంద్ర జడేజా వేయగా అప్పటికి విరాట్‌ కోహ్లి అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు.అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?అయితే, ఫీల్డ్‌ సెట్‌ చేస్తున్న వేళ ఖలీల్‌ మాత్రం శ్రద్ధ లేకుండా తన స్థానం నుంచి పక్కకు జరిగాడు. దీంతో సహనం కోల్పోయిన ధోని.. ‘‘ఖలీల్‌.. అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా అసలు?’’ అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించాడు. ఈ మాటలు స్టంప్‌ మైకులో రికార్డు అయ్యాయి.ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఓపెనర్లు జేకబ్‌ బెతెల్‌ (33 బంతుల్లో 55), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62) దంచికొట్టగా.. రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌) ఆడాడు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ మూడు వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగుల వద్ద నిలిచిపోయింది. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94) శతకం చేజార్చుకోగా.. జడేజా మెరుపులు (45 బంతుల్లో 77 నాటౌట్‌) కూడా వృథాగా పోయాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్తానానికి దూసుకుపోగా.. చెన్నై ఆఖరిదైన పదో స్థానాన్ని మరోసారి అట్టిపెట్టుకుంది.చదవండి: మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.. ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡He smashes a jaw-dropping 53 off just 14 balls,equaling the 2nd fastest fifty in IPL history! Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025 View this post on Instagram A post shared by Mrinal (@cricketcanvas18)

Pak MPs funny reply to India Pak war query goes viral6
‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’

కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్‌ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

Jagadeka Veerudu Athiloka Sundari Movie Ticket Price Goes Viral7
జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. అప్పట్లోనే రూ.210 రూపాయలా!

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్‌ చేయనున్నారు.ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్‌ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన ‍క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్‌లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్‌లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్‌ స్క్రీన్‌పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

Pakistan Again Nuclear Warning To India8
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

Do You Know Dhirubhai Ambani Real Name9
ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?

భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్‌లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం.

Minister Bandi Sanjay Sensational Comments On Maoists10
మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదుకేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది.పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement