
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్‌లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు.
అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు.