Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Again Nuclear Warning To India1
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

Kadapa Muslims JAC Shocks TDP Leaders2
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్‌

వైఎస్సార్‌ జిల్లా, సాక్షి: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. టీడీపీ నేతలు డ్రామాలు ఆపాలంటూ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి మద్దతు తెలిపి టీడీపీ ముస్లింల గొంతు కోసిందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. అయితే ర్యాలీ ప్రారంభం కాకముందే.. టీడీపీ నేత అమీర్‌ బాబు కొందరు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలు వద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేశాకే ఇలాంటి ర్యాలీలకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక అమీర్‌బాబు తన అనుచర గణంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Minister Bandi Sanjay Sensational Comments On Maoists3
మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదుకేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది.పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

IPL 2025, RCB VS CSK: Dhoni Becomes The Third Batter To Complete 50 Sixes Against A Team4
RCB VS CSK: భారీ రికార్డును సొంతం చేసుకున్న ధోని.. కోహ్లి కూడా సాధ్యం కాలేదు..!

ఐపీఎల్‌లో సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ జట్టుపై 50 సిక్సర్లు​ పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లికి కూడా ఇప్పటివరకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనికి ముందు క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు.గేల్‌ పంజాబ్‌ (61), కేకేఆర్‌పై (54) 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. గేల్‌ తర్వాత రోహిత్‌ శర్మ ఈ ఘనత సాధించాడు. హిట్‌మ్యాన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 సిక్సర్లు కొట్టాడు. నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ధోని 50 సిక్సర్ల ఘనత సాధించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి ఈ అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ధోని (262) నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్‌ గేల్‌ (357), రోహిత్‌ శర్మ (297), విరాట్‌ కోహ్లి (290) ధోని కంటే ముందున్నారు.ఐపీఎల్‌లో ఓ జట్టుపై 50కి పైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు61 - క్రిస్ గేల్ vs PBKS54 - క్రిస్ గేల్ vs KKR50 - రోహిత్ శర్మ vs DC50 - MS ధోని vs RCB*మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్‌, కృనాల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Gujarati Man Breaks into Seema Haider House Then Happend This Next5
సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడి మరీ..

న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్‌-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్‌(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్‌.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్‌ సురేందర్‌ నగర్‌కు చెందిన తేజస్‌.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్‌ ఉంటున్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్‌లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్‌ షాట్స్‌ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి ఇచ్చానని తేజస్‌ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే‌ ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

do you know Pakistan total debt6
పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశంగా పాకిస్థాన్‌కు ప్రపంచంలో బహు గొప్ప పేరే ఉంది. బరాక్‌ ఒబామా పాలనలో యూఎస్‌ ఆర్మీ 2011లో అల్‌-ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబత్తాబాద్‌లో చంపేశారు. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ తమకు తెలియకుండానే అక్కడ తలదాచుకున్నాడని అప్పట్లోనే పాక్‌ ప్రపంచ దేశాల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఎనాడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి ప్రజలైనా ఆర్థికంగా, సామాజికంగా మెరుగువుతున్నారా అంటే దేశం అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా చైనా అధిక వడ్డీలకు పాక్‌కు అప్పులిచ్చి, తనకు భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మాత్రం అభివృద్ధి చేస్తోంది. దీన్ని పాక్‌ గ్రహించినా చేసేదేమిలేక మిన్నకుండిపోతుంది. పాక్‌ అప్పుల చిట్టా రూ.లక్షల కోట్లకు పెరిగింది.పాకిస్థాన్‌ మొత్తం రుణం పాక్‌ రూపాయి(పీకేఆర్‌)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్‌ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.పాక్‌ విదేశీ రుణం: 130 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.7 లక్షల కోట్లు).స్వల్పకాలిక విదేశీ చెల్లింపులు: వచ్చే ఏడాదిలో 30.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2.53 లక్షల కోట్లు).రుణ-జీడీపీ నిష్పత్తి: ప్రభుత్వ ఆదాయంలో 50-60% వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేయడంతో 70% పైగా ఉంది.ఐఎంఎఫ్ బెయిలవుట్: ఐఎంఎఫ్ బెయిలవుట్ అనేది అధిక రుణం, కరెన్సీ అస్థిరత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలవుట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరుచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా గ్యాస్ టారిఫ్ పెంపు, కొత్త పన్నులు వంటి కఠిన షరతులతో 2023లో పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీని పొందింది.విదేశీ నిల్వలు: 2025 ఏప్రిల్ నాటికి 15.4 బిలియన్ డాలర్లు(రూ.1.27 లక్షల కోట్లు). ఇది మూడు నెలల దిగుమతులకు సరిపోదు.సైనిక వ్యయంపై ప్రభావం: పెరుగుతున్న అప్పుల కారణంగా పాకిస్థాన్‌ సైన్యానికి అందించే రేషన్‌ను తగ్గించింది. ఇంధన కొరత కారణంగా సైనిక విన్యాసాలను రద్దు చేయవలసి వచ్చింది.ఇదీ చదవండి: డబుల్‌ ప్రాఫిట్‌!ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ.400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది.

APTDC Employee CCTV Footage Viral At Vijayawada7
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు

సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్‌ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్‌ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్‌ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Hit 3 Movie 3rd Day Collection Out Now8
'హిట్‌3' కలెక్షన్స్‌ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' సినిమా మూడురోజుల్లోనే భారీ కలెక్షన్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. వీకెండ్‌లో బాక్సాఫీస్‌ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. అయితే, తాజాగా మూడోరోజు కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు.హిట్‌3 సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫస్ట్‌ డే రూ. 43 కోట్లు, సెకండ్‌ డే రూ. 19 కోట్లు రాబడితే.. మూడోరోజు రూ. 20 కోట్లు రాబట్టింది. నేడు ఆదివారం సెలవు కాబట్టి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. గత రెండు రోజులుగా థియేటర్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ వస్తున్నారు. నానీని అర్జున్‌ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. చిత్ర యూనిట్‌ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్‌ అవుతున్నారు.చాగంటి కోటేశ్వరరావుగారికి నచ్చి వాయిస్‌ ఇచ్చారు: శైలేష్‌ కొలను‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో అర్జున్‌ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్‌ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్‌ సర్కార్‌ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. డార్క్‌ వెబ్‌ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్‌ డిపార్ట్‌మెంట్‌ దీని మీద వర్క్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్‌ వెబ్‌ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤‍🔥It's SARKAAR SHOW at the box office 💥💥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025

Baloch rebels capture major city And seize in Pakistan9
భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ

క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్‌ తగిలింది. పాక్‌ సైన్యానికి సవాల్‌ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్‌ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్‌ చేసిన బీఎల్‌ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్‌ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్‌ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్‌ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్‌ఏ దాడుల్లో వందలాదిమంది పాక్‌ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్‌ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్‌ చేసిన బీఎల్‌ఏ.. పాక్‌ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్‌ఏ పాక్‌ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్‌. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్‌ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్‌ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్‌ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్‌ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్‌ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్‌ నుంచి డిమాండ్‌ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్‌ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్‌ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్‌ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్‌ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్‌ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.

New York Pizza Maker Become Popular Male Fashion Model10
నిన్న పిజ్జా మేకర్‌.. నేడు ఫ్యాషన్‌ మోడల్‌..!

నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్‌ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్‌ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్‌ పేరు క్రిస్టియానో వెన్‌మన్‌. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్‌’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు. న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్‌’ పిజ్జా సెంటర్‌కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్‌ మోడలింగ్‌కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్‌ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్‌లో అవకాశం ఇచ్చాడు. విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌వాక్‌ చేసి, ఫ్యాషన్‌ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్‌డ్‌’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్‌ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్‌ డెలివరీ అవ్వదా..?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement