టెలీ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేసిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తన చాంబర్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో పారిశుధ్యం, సూపర్ జీఎస్‌టీ కాంపెయిన్, ఎరువుల సరఫరా అంశాలపై నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.
గ్రామాల్లో పండుగలు కొనసాగుతున్న దృష్ట్యా రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని, కలుషిత నీరు, ఆహారం తీసుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్‌లో భాగంగా షెడ్యూల్‌లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏ రోజు కార్యక్రమాలను ఆ రోజే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీపై అవగాహన తరగతులను నిర్వహించి విద్యార్థులకు పలు పోటీలు కూడా నిర్వహించాలని సూచించారు.
పిడుగుపాటుకు 13 మేకలు మృతి
శృంగవరపుకోట: మండలంలోని రేగ పుణ్యగిరిలో సోమవారం సాయంత్రం పిడుగు పడడంతో 13 మేకలు మృతి చెందాయి. కొండపై మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో మూగజీవాలు కళ్లెదుటే చనిపోయాయని చెబుతూ పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం బాధితులకు పరిహారం అందజేయాలని పలువురు కోరారు.

అలసత్వాన్ని సహించేది లేదు