మిత్రుడి గృహప్రవేశ వేడుకకు హాజరైన డీజీపీ
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ పరిధిలోని గుంటూరుపల్లిలో జరిగిన మిత్రుడి గృహప్రవేశ వేడుకకు డీజీపీ శివధర్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన గుంటూరుపల్లికి చెందిన భీరెడ్డి థామస్‌రెడ్డి శనివారం గృహప్రవేశం చేశారు. మిత్రమా.. కుశలమా అంటూ అతడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ రావడంతో ఆ ఇళ్లంతా సందడి నెలకొంది. కాగా, థామస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి కలసి చదువుకున్నారు.
– చేర్యాల(సిద్దిపేట)


