సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: మత్తు రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పది పడకల మత్తు పదార్థాల విముక్తి చికిత్స, డీఅడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆస్పత్రి వైద్యాధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత వ్యసనాల నుంచి దూరం చేయడమే లక్ష్యంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వ్యసనాలకు అలవాటు పడిన వారికి చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా మానస్థిక స్థైర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్య విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ చందర్, సైకియాట్రిక్ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ శాంతి, డాక్టర్ సదానందం, డాక్టర్ వినోద్‌బాబ్జి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, సీఐలు లక్ష్మీబాబు, ఉపేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


