మామిడీలా | - | Sakshi
Sakshi News home page

మామిడీలా

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

జిల్లాలో 17 వేల ఎకరాల్లో తోటలు

ఏటా 68 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి

మార్కెట్‌ సౌకర్యం లేక సతమతం

దళారులను విక్రయిస్తూ నష్టపోతున్న రైతులు

మామిడిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్‌ సౌకర్యం లేక కుదేలవుతున్నారు. దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పండించిన మామిడి కాయలు విక్రయించేందుకు 100 నుంచి 150 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి స్థానికంగా మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసి మద్దతు ధర లభించే విధంగా చూడాలని కోరుతున్నారు.

– సాక్షి, సిద్దిపేట

జిల్లావ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. జిల్లాలో బంగినపల్లి, కేసర్‌, హిమాయత్‌, తోటపురి ఇలా వివిధ రకాల మామిడి తోటలున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 68 వేల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. టన్నుకు ప్రస్తుతం రూ.1.40 లక్షల చొప్పున బయట మార్కెట్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఈ ధర ప్రకారం రూ. 952 కోట్ల వ్యాపారం జరగనుంది. అయినా పంట విక్రయానికి రైతులు అపసోపాలు పడుతున్నారు.

మకాం వేసిన దళారులు

జిల్లాలో మామిడి కాయలకు మార్కెటింగ్‌ సౌకర్యం లేక రైతులు దళారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి దళారులు మామిడి తోటలను సందర్శించి గుత్తాలు మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల నుంచి దళారులు, వ్యాపారులు వచ్చి స్థానికంగా తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేసి తరలిస్తుంటారు. కష్టం రైతులది.. ప్రతిఫలం దళారులది అన్నట్లుగా తయారైంది. పంట దిగుబడి తగ్గడం, మధ్యవర్తుల దోపిడీతో మామిడి రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే పంటను తరలించేందుకు రైతులకు దూరాభారం, రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. రైతులు పడిన కష్టానికి మద్దతు ధర లభిస్తుంది. దీంతో రైతుకు ఆర్థిక భరోసా లభించనుంది. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి పరిశ్రమలు నెలకొల్పాలి. మామిడి గుజ్జు తీసి నిల్వ చేయడం, గుజ్జును ఎండబెట్టి మామిడి తాండ్ర, పానీయాలు తయారు చేయడం, ఆమ్‌చూర్‌, నిల్వ పచ్చళ్ల యూనిట్లు పెట్టిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అలాగే పరిశ్రమలు వస్తే యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

హుస్నాబాద్‌ రోడ్డులో ప్రైవేట్‌ వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న షెడ్లు

నైపుణ్యాలకు పదును పెట్టాలి

సిద్దిపేటఎడ్యుకేషన్‌: పట్టుదలతో కృషి చేస్తే విజయాలు సొంతమవుతాయని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కో ఎడ్యుకేషన్‌)లో శుక్రవారం ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ అధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు లేవని బాధపడకుండా తమ నైపుణ్యాలకు పదునుపెట్టి అవకాశాలను సృష్టించుకోవాలని కోరారు. ప్రతిభ, నైపుణ్యాలుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. మేళాకు మొత్తం 54 మంది హాజరుకాగా 38 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికై న అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి ఆఫర్‌ లెటర్‌లను అందించారు. కాగా స్థానిక కళాశాలకు చెందిన 7గురు విద్యార్థులు ఈ మేళాలో ఉద్యోగాలు సాధించడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, అధ్యాపకులు దేవయ్య, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయండి

సర్పంచ్‌, కార్యదర్శులకు డీఎల్‌పీవో విజ్ఞప్తి

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

38 మందికి ఆఫర్‌ లెటర్ల అందజేత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement