12న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

12న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఆదివారం రెండు సెషన్‌లలో నిర్వహించనున్నట్లు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 6వ తరగతి ప్రవేశాలకు పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చెక్‌డ్యామ్‌ పనులు

ప్రారంభించిన ఎమ్మెల్యే

దుబ్బాకరూరల్‌: అక్బర్‌పేటభూంపల్లి మండలం నగరం గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెక్‌డ్యామ్‌ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల నీరువృథాగా పోకుండా అరికట్టవచ్చన్నారు. సర్పంచ్‌ నిర్మల, ఉప సర్పంచ్‌ రమేశ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

మే 4న బాల సాహిత్య

సమ్మేళనం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలంగాణ సారస్వత పరిషత్‌ బాలసాహిత్య సమ్మేళనం మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు, పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య, బాల సాహితీవేత్త భైతి దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రచయితలు, బాల సాహిత్య వికాసం, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు మరింత అవగాహన పెంచే విధంగా పలు అంశాలపై సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు. పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.ఐ వరప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా– వసంతా ట్రస్ట్‌ సౌజన్యం అందిస్తున్న ఈ సమ్మేళనంలో ప్రతినిధులుగా పాల్గొనదలచిన వారు ఈ నెల 20లోగా ‘‘9603727234’’వాట్సాప్‌ నంబర్‌లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

కూలీల పెండింగ్‌ వేతనాలు

చెల్లించాలి: డీబీఎఫ్‌

గజ్వేల్‌/కొండపాక(గజ్వేల్‌): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల పెండింగ్‌ వేతనాలను పెంచాలని డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ మండలం కొడకండ్లలో, కుకునూరుపల్లి మండలంలోని రాయవరంలో శుక్రవారం ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. పనులు చేసే ప్రదేశంలో నీడ సౌకర్యం లేక నీరసిస్తున్నారని, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలు తెలుసుకోడానికే

‘పల్లెపల్లెకు సీపీఐ’

సీపీఐ జిల్లా నేత అశోక్‌

కొమురవెల్లి(సిద్దిపేట): పల్లెపల్లెకు సీపీఐ.. ప్రజల వద్దకు సీపీఐ అంటూ ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌ శుక్రవారం కొమురవెల్లిలో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఎకై క మార్గమన్నారు. కార్మకులు, కర్షకులల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఐకి ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజా ఉద్యమాలే పాలకులను కట్టడి చేయగలవని చెప్పారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కుడికాల బాలమోహన్‌, సహాయ కార్యదర్శి బూర్గు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement