‘ఆయుష్‌’పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

‘ఆయుష్‌’పై అవగాహన

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట ప్రభుత్వ సమీకృత ఆయుష్‌ వైద్యశాలలో ఆయుర్వేదిక్‌, యునానీ, హోమియోపతి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె హైమావతి తెలిపారు. శుక్రవారం ఆయుష్‌ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయుర్వేదిక్‌, యునానీ, హోమియోపతి ఓపీ వార్డులు, మెడిసిన్‌ స్టోర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేదిక్‌, యునానీ, హోమియోపతి వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 50పడకల ఆసుపత్రిలో 24గంటలు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌యాదవ్‌, డాక్టర్‌ వినోద్‌బాబ్జి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి, డాక్టర్‌ గౌతమిప్రియ, డాక్టర్‌ కవిత, డాక్టర్‌ శ్రీప్రియ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సేవలను సద్వినియోగం చేసుకోండి

కలెక్టర్‌ కె.హైమావతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement