మిరుదొడ్డి(దుబ్బాక): రోజు రోజుకు పెరిగిపోతున్న మండుటెండలకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా యాసంగిలో సాగు నీటిపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులకు సాగు నీటి అశనిపాతంగా మారుతోంది. ఎండలకు వరి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కళ్ల ముందు ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రైతులు ఎల్లారెడ్డి, నారాయణరెడ్డి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ వరి పంటను కాపాడుకుంటున్నారు.


