● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
● ఆర్వీఎం ఆస్పత్రికి తరలింపు
కొండపాక(గజ్వేల్): కుటుంబ తగాదాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేదినీపూర్ గ్రామానికి చెందిన తాడెం మల్లేశం, తారలకు పదేళ్ల కింద వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. భర్త మల్లేశం తాపీమేసీ్త్ర పనులు చేస్తుండగా భార్య తార వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. సంతానం కలుగకపోవడంతో పాటు కుటుంబ సమస్యలతో తరచుగా గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో గురువారం ఇంటి వద్ద దంపతుల మధ్య గొడవ జరగగా భర్త భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపంతో భార్య పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భయంతో భర్త మల్లేశం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గడ్డి మందును తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు అంబులెన్సులో ఇద్దరినీ ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గజ్వేల్ కోర్టు జడ్జి శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తల నుంచి మరణ వాంగ్మూలం సేకరించారు.
– నాగరాజు,
డీఎం, మార్కెటింగ్‌శాఖ


