● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ
సిద్దిపేటరూరల్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డులో ప్రత్యేక సభలు నిర్వహించి 8 నుంచి 9 మంది సభ్యులతో కూడిన రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. స్కూల్ బస్సుల్లో, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీపీఓ ధశరథ్, డీపీఓ రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ శంకర్‌నారాయణ, ఆర్‌అండ్‌బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


