ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

సిద్దిపేటకమాన్‌: ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఎయిడ్స్‌ వ్యాధిపై నిర్వహించిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌ఓ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొన్న వారితో ఎయిడ్స్‌ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌బాబ్జి, డాక్టర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, వైద్య సిబ్బంది, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement