నంగునూరు(సిద్దిపేట): మండల పరిధిలోని నర్మేటకు బయో గ్యాస్ ఉత్పదక ఫ్యాక్టరీ మంజూరైంది. వ్యవసాయ వ్యర్థాలతో కంప్రెస్ట్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.250 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. సేంద్రియ, వ్యవసాయ వ్యర్థాలతో రోజుకు 100 టన్నుల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల 10 బయో ప్లాంట్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను నర్మేట లోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయించారు. త్వరలోనే కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో కలసి రాష్ట్ర ఇటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందు కోసం సంబంధిత అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులు ప్రారంభించారు.


