● రోడ్డుపై బైఠాయించి ఆందోళన ● మజీద్‌పల్లిలో ఘటన
వర్గల్(గజ్వేల్): ఈతవనంలో చెట్లను అర్ధరాత్రి దుండగులు నరికేశారంటూ వర్గల్ మండలం మజీద్‌పల్లి గౌడ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఘటన స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మజీద్‌పల్లి ఎల్లమ్మ గుడి సమీప ఈతవనంలో అర్ధరాత్రి తమకు జీవనోపాధిగా నిలుస్తున్న పలు చెట్లు నరికివేశారని వారు మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలిసి తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, ఎకై ్సజ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలం పరిశీలించారు. గౌడసంఘ సభ్యులతో మాట్లాడారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


