డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
గజ్వేల్‌రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బెజుగామలో ఇందిరమ్మ ఇంటిని, గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను బుధవారం సర్పంచ్ గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గజ్వేల్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి, అశోక్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


