అవధాన ప్రక్రియ గొప్పది | - | Sakshi
Sakshi News home page

అవధాన ప్రక్రియ గొప్పది

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ గొప్పదని కవి, పండితులు ఆచార్య దోర్బల ప్రభాకరశర్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లలితా చంద్రమౌలీశ్వర క్షేత్రంలో సందీప్‌ శర్మ చే శతావధానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆచార్య దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ధారణశక్తితో అవధానం అజరామరమన్నారు. సందీప్‌ శర్మ పృచ్ఛకులు అడిగిన పశ్నలకు అలవోకగా పద్యాలను అందించి, ధారణ చేశారు. కార్యక్రమంలో క్షేత్ర నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, కాల్వ రాజయ్య, బోగయగారి చంద్రశేఖరశర్మ, మురళీధరశర్మ, అశోక్‌, రాజశేఖరశర్మ, విట్టుబాబు, శ్రీదేవి, శరత్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement