
మద్యం మత్తులో యువకుడు..
అల్లాదుర్గం(మెదక్): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కాయిదంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంకిడి నాగరాజు (28) జీవనోపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బతుకమ్మ, విజయదశమి పండగను జరుపుకునేందుకు కాయిదంపల్లికి వచ్చాడు. ఇదిలా ఉండగా.. శుక్రవారం సాయంత్రం అతిగా మద్యం తాగి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా కుటుంబీకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాగరాజు అదే మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం గాలించగా సమీపంలోని ఊరచెరువు వద్ద అతడి సెల్‌ఫోన్ కనిపించగా స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది.