
ప్రజాస్వామ్యంపై దాడి
కోర్టు ఆవరణలో ధర్నా చేస్తున్న న్యాయవాదులు
సంగారెడ్డి టౌన్: సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్ కిశోర్ దాడి చేయడాన్ని జిల్లా కోర్టులోని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. జస్టిస్ గవాయ్‌పై దాడికి వ్యతిరేకంగా జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ...సీజేఐపై దాడి భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. దేశంలో లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాజ్యాంగం పెట్టని గోడలా ఉందని, దానిని ధ్వంసం చేయడానికి సనాతన ధర్మం పేరుతో కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి, దేశంలో ఏ కోర్టులో కూడా వాదించకుండా ఆయన బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాస్,రామారావు,నారాయణ, కృష్ణ, దర్శన్, సుభాష్ చందర్, నిజాముద్దీన్ రషీద్, శ్రీను నాయక్,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నారాయణఖేడ్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్‌బీఆర్ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్ కిశోర్ బూటు విసిరి దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ ఖేడ్ జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, కార్యదర్శి నర్సింహారావు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై
దాడిని ఖండిస్తూ న్యాయవాదుల నిరసన