
సామూహిక కుంకుమార్చన
సదాశివపేట(సంగారెడ్డి): దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా పట్టణంలోని భవసార క్షత్రియ సమాజ్ శ్రీభవాని మందిరంలో, శ్రీబంగారు మైసమ్మ మందిరాల్లో మంగళవారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళల సామూహిక కుంకుమార్చన హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణపాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్‌ఎస్ కాంగ్రెస్ నాయకులు చింతా సాయినాథ్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.