కలిసికట్టుగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పనిచేద్దాం

Oct 8 2025 8:11 AM | Updated on Oct 8 2025 8:11 AM

కలిసికట్టుగా పనిచేద్దాం

కలిసికట్టుగా పనిచేద్దాం

జహీరాబాద్‌: సమిష్టిగా ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం జహీరాబాద్‌ మండల అభ్యర్థుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌, సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి, పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎస్‌.ఉజ్వల్‌రెడ్డి, ఐడీఎస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎం.డి.తన్వీర్‌లు మాట్లాడారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్లయితే పార్టీ ఉపేక్షించబోదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, ఈ విషయంలో ఎలాంటి తీర్పు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ తరఫున 42% టికెట్లను బీసీలకు కేటాయిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామ స్థాయిలో ముగ్గురి పేర్లను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. సేకరించిన పేర్లను అధిష్టానవర్గం వద్దకు పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీడీసీ చైర్మన్‌ ముబీన్‌, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, అడ్‌హక్‌కమిటీ చైర్మన్‌ ఎం.జి.రాములు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అస్మా, ఎంపీ క్యాంపు కార్యాలయ ఇంచార్జి శుక్లవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు నాగిశెట్టిరాథోడ్‌, మాణిక్యమ్మ పాల్గొన్నారు.

ముఖ్య నేతల ఐక్యతారాగం

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇటీవల నెలకొన్న విభేదాలకు తెరదించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక సమావేశంలో చంద్రశేఖర్‌, గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి, ఎం.డి.తన్వీర్‌లు ఒకే వేదికపై కూర్చుని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ఐక్యతా రాగం ఆలపించారు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

గ్రూపురాజకీయాలను

పార్టీ ఉపేక్షించదు

సమావేశంలో పార్టీ నేతలు చంద్రశేఖర్‌, గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి,

తన్వీర్‌ల ఐక్యతారాగం

ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement