
కొనసాగుతున్న వరద
మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైంది. సోమవారం 22,000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. మూడు గేట్లను మీటరున్నర ఎత్తు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో 17.500 టీఎంసీల నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రంలో రెండు టర్బయిన్‌ల ద్వారా 2,550 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
సీఎంను సన్మానించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్: ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమ వారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం, నకిరేకల్, భువనగిరి ఎ మ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, అనిల్‌కుమారెడ్డి తదితరులు ఉన్నారు.
జిల్లా వైద్యాధికారి నాగ నిర్మల
హత్నూర(సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నాగ నిర్మల అన్నారు. సోమవారం హత్నూర మండలం చింతలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే ఇతర ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. వైద్య సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. అంతకుముందు ఆమె ఆస్పత్రిలో పలు రికార్డులు, మందులను పరిశీలించారు.
బీకేఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి
సంగారెడ్డి టౌన్: అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం అందించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తొందరగా ప్రారంభించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. మొదట రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేసిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న వరద

కొనసాగుతున్న వరద

కొనసాగుతున్న వరద