
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించేలా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావ ళి అమలు చేయాలని ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో తహసీల్దార్లు ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికే ఆ బాధ్యతలను అప్పగించారు. స్థానిక ఎన్నికల పూర్తి బాధ్యతను ఆయా ఎంపీడీఓలు, ఎంపీవో (మండల పంచాయతీ అధికారి)లకు అప్పగించింది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎంపీడీవోలు, ఎంపీవోల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1,747 ప్రిసైడింగ్ అధికారులను, 7,581మంది పోలింగ్ అధికారులు, 5,507మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు.
నోటాకు చోటు..
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నన్ ఆఫ్ ది ఎబౌవ్ (నోటా)కు ఎన్నికల సంఘం చోటు కల్పించింది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుపురంగు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను అందించనున్నారు. పోటీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసేందుకు ఓటరు సిద్ధంగా లేని పక్షంలో నోటాను ఎంచుకునే అవకాశం ఉంది. సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని కేటాయించారు. ఈ ఎన్నికల్లోనూ నోటా గుర్తును కేటాయించనున్నారు.
ప్రత్యేక అధికారులే ఆర్వోలు
ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారే ఆర్వోలుగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థులు ఆయా మండల కేంద్రాల్లో మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మూడు లేదా నాలుగు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక క్లస్టర్ అధికారిని నియమించనున్నారు. ఆ క్లస్టర్ స్థాయి ఆర్వోకు వీటిని అందించాలి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి మండల స్థాయి ఆర్వోకు పత్రాలను అందించాలి. క్లస్టర్ స్థాయి అధికారులుగా గెజిటెడ్ హోదా కలిగిన ప్రధానోపాధ్యాయులతోపాటు జిల్లాస్థాయిఽ అధికారులను నియమిస్తున్నారు.
తహసీల్దార్ల ఆధ్వర్యంలో
ఎలక్షన్‌కోడ్ అమలు
ఎంపీడీవోల ఆధ్వర్యంలో
ఎన్నికల నిర్వహణ
నోటాకు చోటు..
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు
జెడ్పీటీసీకి తెలుపురంగు,
ఎంపీటీసీకి గులాబీరంగు బ్యాలెట్
సర్పంచ్‌కు పింక్,
వార్డు సభ్యుడికి తెలుపు