అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట రూరల్: ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. తన స్వగ్రామమైన యాదగిరి గుట్ట మండలం సైదాపురంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తరువాత వాహన పూజలో పాల్గొన్నారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీరిదిద్దుతానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు సుఖంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


