
ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు నాయకులు మృతి
కోదాడ రూరల్ : కోదాడ నియోజకవర్గంలో ఒకే రోజు ముగ్గురు రాజకీయ నాయకుల గుండెపోటు మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కోదాడ పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆళ్ల భాగ్యరాజ్(34) మంగళవారం జ్వరం బారినపడి ట్యాబ్లెట్‌లు వేసుకున్నాడు. రాత్రి పడుకున్న తర్వాత బుధవారం తెల్లవారుజామున భార్య లేపగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్నాడు. వైద్యుడిని పిలిపించి చూడగా గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. అదేవిధంగా నడిగూడెం మండలం బృందావనపురానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మండవ అంతయ్య(81) బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో వేణుగోపాలపురం వెళ్లాడు. అక్కడ ఓ నాయకుడి ఇంటి వద్ద స్థానిక సంస్థల అభ్యర్థిత్వంపై చర్చిస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు, కోదాడకు తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. చిలుకూరు మండల మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ నాయకుడు దొడ్డా సురేష్‌బాబు(54) బుధవారం సాయంత్రం కోదాడ పట్టణానికి వచ్చి స్నేహితులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మృతిచెందారు.
సురేష్‌బాబు(ఫైల్)
అంతయ్య (ఫైల్)
భాగ్యరాజ్ (ఫైల్)
ఫ కోదాడ నియోజకవర్గంలో విషాదం

ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు నాయకులు మృతి

ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు నాయకులు మృతి