మాడుగులపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో రైతులు సాగు చేసిన వరి పొలాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు రైస్ మిల్లర్లను, మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నందున రైతులు ధాన్యంలో తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో, 17శాతం తేమ ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఓ ఎం.శివరాంకుమార్, ఏఈఓ వేణుగోపాల్, రైతులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్