
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
మునుగోడు : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. దీంతో అనేక మంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య, నాయకులు భవనం మధసూదన్‌రెడ్డి, బోడిగె అశోక్‌గౌడ్, పుల్కరం సైదులు, బండారి యాదయ్య, అక్కెనపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.