
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నర్సంపేట రూరల్ : మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య రమేశ్ (48) కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఏం పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం తెలిపారు.