
పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించారు..
● గ్రూప్–2 ఉద్యోగం సాధించిన
పలువురు జిల్లా వాసులు
ఏఎస్‌ఓగా ఎంపికై న ప్రణీత్ కుమార్
పెద్దవంగర: మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన చెన్న ప్రణీత్ కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో 138 ర్యాంక్ సాధించి ఏఎస్‌ఓగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ–నాగలక్ష్మి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయం చేస్తూ తమ కుమారుడికి ఉన్నత విద్యను అందించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు.
జిల్లాకు చెందిన పలువురు గ్రూప్–2 ఉద్యోగం సాధించారు. ఆదివారం టీజీపీ ఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో సత్తా చాటా రు. పట్టుదలతో చదివి లక్ష్యాన్ని ముద్దాడారు.
ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు
దంతాలపల్లి: మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన దిగోజ్ శిరీష్ గ్రూప్–2 ఫలితాల్లో ఆబ్కారీ ఎస్సైగా కొలువు సాధించాడు. కాగా ఆయన పంచాయతీ కార్యాదర్శిగా విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్–4 లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం హనుమకొండ కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆబ్కారీ ఎస్సైగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నరేందర్
కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మనబోయిన నరేందర్ గ్రూప్–2లో ప్రతిభ కనపరిచి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నరేందర్ ఇప్పటికే సంజ్రాయిగూడెం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
సబ్ రిజిస్ట్రార్‌గా ముల్కలపల్లి వాసి
డోర్నకల్: మండలంలోని ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. గ్రూప్–2లో ఫలితాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా కొలువు సాధించాడు. ఇప్పటికే ఆయన మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించారు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించారు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించారు..