
నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ.48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్‌నాఽథ్ పర్యవేక్షించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని):ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.
బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు..
వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు ఎన్నాదేవి వద్ద ఉన్న 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మంగళవారం సందర్శించా రు. 400 కేవీ సబ్‌స్టేషన్ అలియనేషన్‌లో భాగంగా ట్రాన్స్‌కోకు కేటాయించేందుకు ప్రతిపాదించిన 14.92 ఎకరాల స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయనతోపాటు సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, తహసీల్దారు కేఎస్ చక్రవర్తి తదితరులు ఉన్నారు.
గుంటూరురూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం జాయింట్ రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నోటీసులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు, దూరవిద్యలో పనిచేస్తున్న ఇద్దరు అకడమిక్ కౌన్సెలర్లకు సెప్టెంబరు 29న ఈ మెయిల్ ద్వారా వర్సిటీ అధికారులు సమాచారం అందించారు. కొద్ది నెలల క్రితం 60 ఏళ్లు పూర్తయిన వారిని తొలగిస్తూ వర్సిటీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సెప్టెంబరు 30 వరకు విధుల్లో కొనసాగారు. తాజాగా సెప్టెంబరు 29న వర్సిటీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేటగిరిలో సుమారు 11 మంది ఉండగా వారిలో ఆరుగురికి మాత్రమే నోటీసులు అందాయి.

నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు