
నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నారా వారి నకిలీ మద్యంపై మహిళా లోకం కన్నెర్రజేసింది..ఆడబిడ్డల పుస్తెలు తెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మద్యంలో చంద్రబాబు, లోకేష్ వాటాలు ఎంత ? పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఎంత ? అని మహిళలు నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని ఎకై ్సజ్ కార్యాలయం వద్ద బుధవారం నకిలీ మద్యం, కూటమి కల్తీ విధానాలపై ఆందోళన చేపట్టారు. ముందుగా కల్తీ మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి కారుకులైన వారిపై కేసులు నమోదు చేయాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల దొరుకుతున్న కల్తీ మద్యంలో అసలు నిందితులు ఎవరో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు వెళ్తున్నాయని, పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తుండటంతో నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. కచ్చితంగా మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, కార్పొరేటర్ ఫర్జానా, ఎం. ఉషారాణి, భాగ్యమ్మ, వరలక్ష్మి, తోటకూర స్వర్ణలత, షేక్ సలీం, షేక్ సుభాని, దోర్నాల శ్రీకాంత్‌రెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దూపాటి సాల్మన్, రాణా ప్రతాప్ పాల్గొన్నారు.