
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం: కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు– కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్‌తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్దీకరించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి