
ఎంపీపీగా నాగినేని దుర్గాదేవి బాధ్యతల స్వీకరణ
నిండ్ర : నిండ్ర ఎంపీపీగా వైస్ ఎంపీపీ దుర్గాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో ఎంపీపీగా ఉన్న దీప వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన విషయం విధితమే. ఎంపీపీకి రాజీనామా సమర్పించే హక్కు ఉన్నందున ఆమె రాజీనామా ఆమోదించి గెజిట్ 14/2021లోని నిబంధనల మేరకు వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగినేని దుర్గాదేవికి ఎంపీపీగా బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో శివప్రసాద్‌వర్మ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కేరోజా హాజరై నూతన ఎంపీపీకి శుభాకాంక్షలతో పాటు ఆశీస్సులు అందజేశారు. ఎంపీపీ దుర్గ, పార్టీ నేతలు మాజీ మంత్రిని దుశ్శాలువలతో సత్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ పదవులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేయాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. పదవికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీపీ దీప, వైస్ ఎంపీపీ శుభ, ఎంపీటీసీలు విజేష్, రమ్య, కో–ఆప్షన్ సభ్యుడు అనిల్, జెడ్పీటీసీ పరంధామన్, రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి శ్యామ్‌లాల్, విజయపురం, నిండ్ర మండల పార్టీ అధ్యక్షుడు వేణురాజు, శివరాజు, విజయపురం ఎంపీపీ మంజు బా లాజీ, సర్పంచ్‌లు బాబురెడ్డి, చంద్రబాబు నాయకు లు మునికృష్ణారెడ్డి, శివయ్య, శివరాజు, రామచంద్రయ్య, మహేష్, చార్లీ, రాము పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో ఎంపీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న దుర్గాదేవి
మాజీ మంత్రి, నూతన ఎంపీపీతో పార్టీ నేతలు

ఎంపీపీగా నాగినేని దుర్గాదేవి బాధ్యతల స్వీకరణ