
గుడి ఎనక నా సామి!
ప్రచార యావ కోసం రెచ్చిపోతున్న టీటీడీ
పాలక మండలి సభ్యుడు
నిత్యం దేవుడికి రాజకీయ రంగు పులమడమే ఆయన పని
విస్తుపోతున్న భక్తులు
వరివట్టం కట్టడం విషయంలో గతంలో ఏమైనా జరిగాయో లేదో పక్కన పెడితే ఇలా చేయడం బహిరంగంగా తప్పని పండితులు చెప్తున్నారు.
అయితే సదరు సభ్యుడు పబ్లిసిటీ పిచ్చి కోసం టీటీడీని అడ్డంగా వాడుకుంటున్నాడు. టీటీడీలో అనేక మంది పాలకమండలి సభ్యులు ఉన్నా.. ఎవరూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయరు. కానీ సదరు సభ్యుడు మాత్రం శ్రీవారి ఆలయం ముందు నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 2019 క్రితం పాలకమండలి సమావేశంలో అయితే ఏకంగా చైర్మన్ కార్యాలయంలోనే సమావేశం నిర్వహించి.. రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై భక్తులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా ఇలా మాట్లాడడంపై పలువురు భక్తులు రగిలిపోతున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గురివిందకు కింద నలుపు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఓ పాలక మండలి సభ్యుడు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో గోవిందా...! నారాయణ..! అంటూనే ఇతరులపై విషం చిమ్ముతున్నాడు. ఆఖరుకి రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరివట్టం వ్యవహా రం కూడా ఆయన తన రాజకీయ వేదిక కింద మలిచేశారు. టీటీడీలో ఏ వివాదం తలెత్తినా తగుతునమ్మా అంటూ వకల్తా పుచ్చుకుంటున్నాడు. పోనీ వాస్తవాలు చెబుతాడా..! అంటే అదీ లేదు. అన్నీ అసత్యాలే. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వారికి సంబంధించిన అంశాలు అయితే మాత్రం తిరుమలను వేదికగా చేసుకొని ప్రసంగాలు దంచేస్తాడు. ఇక రోజు మార్చి రోజు దర్శనానికి వచ్చే ఆయన అయితే.. టీటీడీ చైర్మన్ ప్రాపకం కోసం ఆయన చానల్లో కనిపించడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. అసత్యాలను వల్ల్లివేస్తున్నాడు.
చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది మాత్రం..!