Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు.

మరింత అగ్గి రాజేసేలా.. పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025

దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
ఫుడ్ బిజినెస్‌కు ఎపుడూ మంచి డిమాండ్ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్ సక్సెస్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్ స్టాల్‌ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!

IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
భారీ అంచనాలతో ఐపీఎల్-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (రైజర్స్- 286)పై దంచికొట్టడం మినహా ఈసారి రైజర్స్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనబడలేదు.తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT vs SRH)తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్ బృందం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగా చెలరేగి..ఈ క్రమంలో టైటాన్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి.. రైజర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76).. వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) ధనాధన్ దంచికొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.సన్‌రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరి బౌలింగ్ (షమీ 48, పటేల్ 41)లో టైటాన్స్ 89 పరుగులు పిండుకుంది. మిగతావాళ్లలో కెప్టెన్ కమిన్స్, జీషన్ అన్సారీ ఒక్కో వికెట్ తీయగా.. జయదేవ్ ఉనాద్కట్ మూడు వికెట్ల (3/35)తో రాణించాడు.అభిషేక్ శర్మ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20) మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 13) జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిచ్ క్లాసెన్ (18 బంతుల్లో 23), నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 186 పరుగుల వద్ద నిలిచి.. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే.. కానీఇక ఇప్పటికి ఈ సీజన్లో పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి. తద్వారా మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లలో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.అయితే, ఇంకా దింపుడు కళ్లెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.ఇతర జట్ల పరిస్థితి ఇలాప్రస్తుతం ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (10 మ్యాచ్‌లు, 6 విజయాలు, 13 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 మ్యాచ్‌లు, ఐదు విజయాలు, 10 పాయింట్లు) టాప్-5లో ఉన్నాయి.ఇక లక్నో సూపర్ జెయింట్స్ (10 మ్యాచ్‌లు, 5 విజయాలు 10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (10 మ్యాచ్‌లు, 4 విజయాలు,9 పాయింట్లు)లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ (11 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో ఎనిమిదో స్థానంలో ఉండడగా.. సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో రన్‌రేటు పరంగా వెనుకబడి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్(10 మ్యాచ్‌లు, రెండు విజయాలు, నాలుగు పాయింట్లు)ఆఖర్లో పదో స్థానంలో ఉంది.ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై గెలిచిరాజస్తాన్, చెన్నైలను మినహాయిస్తే సాంకేతికంగా మిగిలిన ఎనిమిది జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ గనుక మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై ఘన విజయం సాధిస్తే.. పద్నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు (ప్రస్తుతం- -1.192) కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా.. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్, ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్‌లలో మెజారిటీ శాతం ఓడిపోవాలి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కూడా రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా తదుపరి మ్యాచ్‌లో ఎక్కువగా ఓడిపోవాలి. ఇంతా జరిగినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇంకేదో అద్భుతం జరగాలి. అయితే, తదుపరి ఢిల్లీ (మే 5)తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం ఓడిందా.. ఇక అంతే సంగతులు! టోర్నీ నుంచి అవుట్.. సోషల్ మీడియా మీమర్ల భాషల్లో చెప్పాలంటే చెన్నై, రాజస్తాన్‌లతో పాటు అసోం రైలుకు టికెట్ కన్ఫామ్ చేసుకున్నట్లే!!చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్ గగ్గోలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు.
నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి నిరాశ!
అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
కొత్త రిసార్ట్‌లను ప్రారంభించిన క్లబ్ మహీంద్రా
'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి నిరాశ!
అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
కొత్త రిసార్ట్‌లను ప్రారంభించిన క్లబ్ మహీంద్రా
'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
సినిమా

నేను ఒక యాక్సిడెంటల్ నటుడిని.. అప్పుల కోసమే నటించా: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో అభిమానులను అలరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఏ క్షణంలోనైనా సినిమాలను అర్ధాంతరంగా వదిలేయాల్సి రావొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తాను యాక్సిడెంటల్‌గా నటనలోకి వచ్చానని వెల్లడించారు. తన జీవితంలో రేసర్ కావాలని కోరుకున్నానని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కుదరలేదని తెలిపారు. నీకిష్టమైన పనినే చేయాలని తన తండ్రి చెప్పేవారని.. కానీ అప్పులు తీర్చడానికి మోడలింగ్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి నటుడిగా మారి ఉన్న అప్పులన్నీ తీర్చానని వెల్లడించారు.

కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే
హీరో నాని నుంచి లేటెస్ట్ గా 'హిట్ 3' సినిమా వచ్చింది. మే 01న రిలీజైన ఈ చిత్రానిక రెండు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూవీపై కొందరికి నచ్చనప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నాని రెండు సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు.గత కొన్నాళ్ల నుంచి తన ప్రతి సినిమాతో ఆకట్టుకుంటున్న నాని.. ఓవర్సీస్ అంటే విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. హిట్ 3తో వరసగా 11వ సారి మిలియన్ మార్క్ వసూళ్లు సాధించాడు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సరసన చేరాడు. ఇంతకు ముందు మహేశ్ ఈ ఘనత సాధించాడు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) మరోవైపు 5 కంటే ఎక్కువగా 1.5 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన హీరోగానూ నాని నిలిచాడు. ఈ లిస్టులో ఇంతకు ముందు మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు నాని కూడా వాళ్లతో చేరిపోయాడు. నాని అందరూ మీడియం రేంజ్ హీరో అంటున్నారు గానీ ఓవర్సీస్ లో వసూళ్లు చూస్తుంటే స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గట్లేదని అనిపిస్తుంది.హిట్ 3 విషయానికొస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే వయలెన్స్ ఎక్కువుందనే టాక్ వస్తోంది. నాని కూడా ఈ విషయం ముందే చెప్పాడు. కాబట్టి ఈ తరహా రక్తపాతం సినిమాలు నచ్చేవాళ్లు హిట్ 3కి వెళ్తున్నారు. దీని తర్వాత అంటే త్వరలో 'ద ప్యారడైజ్' సెట్స్ లో నాని అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం డైరెక్టర్ సుజీత్ తో ఓ మూవీ చేస్తాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)

రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి
ఫోక్ వీడియో సాంగ్స్ తో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ అలియాస్ జాను లిరి.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లోనూ పాల్గొని విజేతగా నిలిచింది. రీసెంట్ గా ఆహా ఓటీటీలోనూ డ్యాన్స్ షోలో పాల్గొంది కానీ ఎలిమినేట్ అయిపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్-ఈమెపై చాలా ట్రోలింగ్ నడిచింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనేలా చాలా ట్రోల్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) కొన్నిరోజుల క్రితం ఈ ట్రోలింగ్ పై స్పందించిన శేఖర్ మాస్టర్.. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదని, జాను లిరితో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే నిన్న జాను ఓ వీడియో రిలీజ్ చేసింది.'నన్ను టార్గెట్ చేయడం ఆపండి. నేనేం చేసినా తప్పే అంటున్నారు. ఇన్‌స్టాలో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు?' అని బోరున ఏడుస్తూ వీడియో పెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఇప్పుడు తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. 'ఇకపై ట్రోలింగ్ పట్టించుకోను. అవును నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అందరికీ సమాధానమిస్తాను. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో ఎంతో సంతోషంగా ఉంటాను. అంతే తప్ప ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లను. జీవితంలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చింది.ఈమె పదో తరగతిలో ఉండగానే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొడుకు కూడా పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేందుకు జాను లిరి సిద్ధమైంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతుంది.(ఇదీ చదవండి: ‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official)

ఫోటోలో కనిపించిన పాప వివరాలు తెలిపిన 'శ్రీలీల'
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫోటోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని క్యాప్షన్ పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తత తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ సమయంలో వారిని దత్తత తీసుకుంది. దీంతో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తత తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలోని పాప గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ షేర్ చేసింది.ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల కాస్త విరామం దొరకగానే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది. ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఈ పిన్నిలో మరింత జోష్ నింపింది' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపింది. పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌లో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ సమయంలోనే కార్తిక్ - శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)
న్యూస్ పాడ్‌కాస్ట్

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్
క్రీడలు

IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
భారీ అంచనాలతో ఐపీఎల్-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (రైజర్స్- 286)పై దంచికొట్టడం మినహా ఈసారి రైజర్స్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనబడలేదు.తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT vs SRH)తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్ బృందం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగా చెలరేగి..ఈ క్రమంలో టైటాన్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి.. రైజర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76).. వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) ధనాధన్ దంచికొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.సన్‌రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరి బౌలింగ్ (షమీ 48, పటేల్ 41)లో టైటాన్స్ 89 పరుగులు పిండుకుంది. మిగతావాళ్లలో కెప్టెన్ కమిన్స్, జీషన్ అన్సారీ ఒక్కో వికెట్ తీయగా.. జయదేవ్ ఉనాద్కట్ మూడు వికెట్ల (3/35)తో రాణించాడు.అభిషేక్ శర్మ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20) మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 13) జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిచ్ క్లాసెన్ (18 బంతుల్లో 23), నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 186 పరుగుల వద్ద నిలిచి.. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే.. కానీఇక ఇప్పటికి ఈ సీజన్లో పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి. తద్వారా మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లలో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.అయితే, ఇంకా దింపుడు కళ్లెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.ఇతర జట్ల పరిస్థితి ఇలాప్రస్తుతం ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (10 మ్యాచ్‌లు, 6 విజయాలు, 13 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 మ్యాచ్‌లు, ఐదు విజయాలు, 10 పాయింట్లు) టాప్-5లో ఉన్నాయి.ఇక లక్నో సూపర్ జెయింట్స్ (10 మ్యాచ్‌లు, 5 విజయాలు 10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (10 మ్యాచ్‌లు, 4 విజయాలు,9 పాయింట్లు)లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ (11 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో ఎనిమిదో స్థానంలో ఉండడగా.. సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో రన్‌రేటు పరంగా వెనుకబడి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్(10 మ్యాచ్‌లు, రెండు విజయాలు, నాలుగు పాయింట్లు)ఆఖర్లో పదో స్థానంలో ఉంది.ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై గెలిచిరాజస్తాన్, చెన్నైలను మినహాయిస్తే సాంకేతికంగా మిగిలిన ఎనిమిది జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ గనుక మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై ఘన విజయం సాధిస్తే.. పద్నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు (ప్రస్తుతం- -1.192) కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా.. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్, ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్‌లలో మెజారిటీ శాతం ఓడిపోవాలి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కూడా రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా తదుపరి మ్యాచ్‌లో ఎక్కువగా ఓడిపోవాలి. ఇంతా జరిగినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇంకేదో అద్భుతం జరగాలి. అయితే, తదుపరి ఢిల్లీ (మే 5)తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం ఓడిందా.. ఇక అంతే సంగతులు! టోర్నీ నుంచి అవుట్.. సోషల్ మీడియా మీమర్ల భాషల్లో చెప్పాలంటే చెన్నై, రాజస్తాన్‌లతో పాటు అసోం రైలుకు టికెట్ కన్ఫామ్ చేసుకున్నట్లే!!చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

వారెవ్వా!.. చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. తొలి ఆటగాడిగా రికార్డు
గుజరాత్ టైటాన్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ (Jos Buttler) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఈ ఘనత సాధించాడు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.సాయి 23 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. గిల్ (38 బంతుల్లో 76)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్ 37 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 64 పరుగులు రాబట్టాడు.4000 పరుగుల మైలురాయిఅయితే, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో బట్లర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన బట్లర్.. ఐపీఎల్ కెరీర్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా బట్లర్ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఐపీఎల్లో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లోనే) ఈ మార్కు అందుకున్న మూడో బ్యాటర్‌గా.. అదే విధంగా.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయి అందుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా బట్లర్ గతంలో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో తక్కువ బంతుల్లోనే 4000 పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్లు👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 2658 బంతుల్లో👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2658 బంతుల్లో👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2677 బంతుల్లో👉సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 2714 బంతుల్లో..ఐపీఎల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉కేఎల్ రాహుల్ (ఇండియా)- 105 ఇన్నింగ్స్‌లో👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 112 ఇన్నింగ్స్‌లో👉డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 116 ఇన్నింగ్స్‌లో👉ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా)- 121 ఇన్నింగ్స్‌లో👉విరాట్ కోహ్లి (ఇండియా)- 128 ఇన్నింగ్స్‌లో.ఇక గుజరాత్- హైదరాబాద్ మ్యాచ్ విషయానికొస్తే.. సాయి, గిల్, బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా గుజరాత్ 38 పరుగులు తేడాతో జయభేరి మోగించింది.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! How’s the JOS? Quite high, indeed! 🙌🏻🔥#JosButtler continued his stellar IPL form with another fifty as #GT push towards a massive first-innings total!Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/sUDd0x9erf— Star Sports (@StarSportsIndia) May 2, 2025

Shubman Gill: అంపైర్లతో గొడవ.. తప్పేముంది?.. తగ్గేదేలే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరును గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సమర్థించుకున్నాడు. వందకు నూటా పది శాతం కష్టపడుతున్నపుడు ఇలాంటివి జరుగుతాయని.. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా టైటాన్స్ శుక్రవారం సన్‌రైజర్స్‌తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు.అంపైర్లతో వాదనతనకు అచ్చొచ్చిన మైదానంలో గిల్ శతకం దిశగా పయనిస్తున్న వేళ అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో జోస్ బట్లర్ పరుగుకు యత్నించగా.. గిల్ రన్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో ఫీల్డర్ హర్షల్ పటేల్ విసిరిన బంతిని వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అందుకుని వికెట్లకు గిరాటేశాడు.అయితే, బంతి క్లాసెన్ గ్లోవ్స్‌ను తాకి స్టంప్స్ పక్కగా వెళ్లింది. అప్పుడు క్లాసెన్ గ్లవ్ తాకి స్టంప్స్ పైకి ఎగిరినట్లు కనిపించింది. అయితే, కీపర్ చేతిలో ఉండగానే బంతి స్టంప్‌ను తాకిందా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ టీవీ అంపైర్ మాత్రం గిల్‌ను అవుట్‌గానే ప్రకటించాడు.మరోసారి వాగ్వాదంఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన శుబ్‌మన్ గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ విషయంలో ఎల్బీడబ్ల్యూ అప్పీలు అంశంలో ప్రతికూల నిర్ణయం రావడంతో కోపోద్రిక్తుడయ్యాడు.మళ్లీ అప్పుడు కూడా గిల్ అంపైర్‌తో వాదనకు దిగాడు. ఈ పరిణామాల గురించి విజయానంతరం గిల్ స్పందించాడు. ‘‘నాకు, అంపైర్‌కు మధ్య చర్చ జరిగింది. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపుచేసుకోలేము.తప్పేముంది?.. తగ్గేదేలేగెలిచేందుకు వందకు 110 శాతం కృషి చేస్తున్నపుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగిన విషయం గురించే మాట్లాడాను. ఈ వైఖరి తప్పని నేను అనుకోను’’ అని గిల్ స్పష్టం చేశాడు. స్కోరు బోర్డును ఎలా పరుగులు తీయించాలో తమకు తెలుసునని.. ఏదేమైనా ప్లే ఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఏడో గెలుపు. తద్వారా పద్నాలుగు పాయిం ట్లతో పట్టికలో రెండోస్థానంలోకి దూసుకు వచ్చింది. మరోవైపు.. ఏడో పరాజయం నమోదు చేసిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. ఐపీఎల్-2025: టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్👉టాస్: సన్‌రైజర్స్.. తొలుత బౌలింగ్👉టైటాన్స్ స్కోరు: 224/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 186/6 (20)👉ఫలితం: 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై టైటాన్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రసిద్ కృష్ణ (టైటాన్స్ పేసర్- నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు).చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! What's your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O— Star Sports (@StarSportsIndia) May 2, 2025

టైటిల్ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. మిగతా తొమ్మిది జట్లు పదేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్తాన్‌కి ఇంకో మూడు.. మిగతా జట్లకు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.అగ్రస్థానంలోఇక ఇప్పటికి పదకొండింట ఏడు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా ఏడేసి మ్యాచ్‌లు గెలిచినా.. రన్‌రేటు పరంగా వెనుకబడి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో ఆరు మ్యాచ్‌లు గెలిచి ఇదే తరహాలో నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు.. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు విజయాలతో ఏడు, రాజస్తాన్ రాయల్స్ మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.అట్టడుగునఅదే విధంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు , చెన్నై సూపర్ కింగ్స్ రెండు మాత్రమే గెలిచి అట్టడుగున తొమ్మిది, పది స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్ విజేతగా నిలవగా.. సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు.. ఇంత వరకు టైటిల్ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి.ముఖ్యంగా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లికి ఓపెనింగ్ జోడీగా వచ్చిన ఫిల్ సాల్ట్ అదరగొడుతుండగా.. బ్యాటర్‌గానూ రజత్ రాణిస్తున్నాడు. మరోవైపు.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు.ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రభావం చూపుతుండగా.. స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సమిష్టి ప్రదర్శనకు నిదర్శనంఇప్పటికి గెలిచిన ఏడు మ్యాచ్‌లలో ఐదుగురు వేర్వేరు ప్లేయర్లు (కోహ్లి, కృనాల్ పాండ్యా (3), పాటిదార్ (2), ఫిల్ సాల్ట్, హాజిల్‌వుడ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ ఆర్సీబీ టైటిల్ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది.టైటిల్ గెలిచేది ఆ జట్టే.. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది.వాళ్ల ఫీల్డింగ్ కూడా సూపర్. ముంబై ఇండియన్స్ కూడా అదరగొడుతోంది. అయితే, మిగతా మ్యాచ్‌లలో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము.అయితే, ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగు ఉండదు. కానీ.. ఈసారి మాత్రం ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అని గావస్కర్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోస్యం చెప్పాడు.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!
బిజినెస్

ఆస్తుల్లో వీరెంత.. వారెంత..?
ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తులకు ఆదరణ లభిస్తే అపార సంపద చేకూరుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్ అత్యంత ప్రభావవంతమైన సీఈఓలను తయారు చేశాయి. సంపదలో హెచ్చుతగ్గులున్నా ఎవరి ప్రత్యేకత వారిదే. ఇరుదేశాలకు చెందిన ఈ సీఈఓలు తమ కంపెనీల లాభాలను పెంచడమే కాకుండా దేశ వ్యాపార ముఖచిత్రాలను మారుస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌కు చెందిన టాప్ సీఈఓలు, వారి నికర ఆస్తులు, వారి పరిశ్రమల వివరాలు కింద తెలుసుకోవచ్చు.2025 లెక్కల ప్రకారం ఇండియాలోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. ముఖేష్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ ఉన్నారు. 110 బిలియన్ డాలర్ల (రూ.9.1 లక్షల కోట్లు) నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. టెలికాం నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు అన్ని రంగాలను అంబానీ శాసిస్తున్నారు.2. గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన నికర సంపద 56.3 బిలియన్ డాలర్లు(రూ.4.75 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. దేశంలోని ప్రముఖ పోర్ట్స్ దగ్గర నుంచి పవర్ జనరేషన్ వరకు చాలా రంగాల్లో సేవలందిస్తున్నారు.3. సుందర్ పిచాయ్ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ. 1.3 బిలియన్ డాలర్లు (రూ.10,800 కోట్లు) సమీకరించారు. తమిళనాడులో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థకు నేతృత్వం వహిస్తూ కృత్రిమ మేధ, ఆన్లైన్ సెర్చ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు.4. సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈఓ. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ పవర్హైజ్గా మార్చారు. అతను 331 మిలియన్ డాలర్ల (రూ.2,750 కోట్లు) నికర విలువను కలిగి ఉన్నారు.5. ఫాల్గుణి నాయర్ఫాల్గుణి నాయర్ నైకా అనే బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీకి సీఈఓ. ఫోర్బ్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 3.64 బిలియన్ డాలర్లు (రూ.30,300 కోట్లు).ఇదీ చదవండి: రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?పాకిస్థాన్‌లోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. షాహిద్ ఖాన్పాకిస్థానీ-అమెరికన్ వ్యాపార దిగ్గజం ఫ్లెక్స్-ఎన్-గేట్ సీఈఓ షాహిద్ ఖాన్. 13.3 బిలియన్ డాలర్ల (రూ.1.1 లక్షల కోట్లు) సంపదతో పాక్‌లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఎన్ఎఫ్ఎల్ జట్టు జాక్సన్ విల్లే జాగ్వార్స్, ఇంగ్లీష్ క్లబ్ ఫుల్హామ్ ఎఫ్‌సీలకు ఆధిపతిగా ఉన్నారు.2. మియాన్ ముహమ్మద్ మాన్షామాన్షా నిషాత్ గ్రూప్ ఛైర్మన్. 5 బిలియన్ డాలర్ల (రూ.41,500 కోట్లు) నికర విలువతో పాకిస్థాన్ తొలి బిలియనీర్ వ్యాపారవేత్త. అతని వ్యాపార సామ్రాజ్యం బ్యాంకింగ్, టెక్స్టైల్స్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తిలో విస్తరించి ఉంది.3. షాజియా సయ్యద్యూనిలీవర్ పాకిస్తాన్ సీఈఓ షాజియా సయ్యద్ నికర విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమె నాయకత్వంలో మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో సుస్థిరత, బ్రాండ్ నమ్మకాన్ని ప్రోత్సహించడంలో గుర్తింపు పొందారు.4. అసద్ ఉమర్ఎంగ్రో కార్పొరేషన్ మాజీ సీఈఓ. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఉమర్ విలువ 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) ఉంటుందని అంచనా.5. షోయబ్ సిద్ధిఖీజాజ్ పాకిస్థాన్ సీఈఓ షోయబ్ సిద్ధిఖీ. ఈయన సంపద 2 మిలియన్ డాలర్లు (రూ.16.5 కోట్లు). దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సేవలు, మొబైల్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు. ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్సీఆర్ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్‌కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్‌కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది. డెలివరీలో వేగవంతం.. 2018–19 మధ్య కాలంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్‌లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్‌కం హౌసింగ్(ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి.

రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం నిలువలు పరిమితంగా ఉండడంతో దాని విలువ పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర రూ.96 వేలకుపైగా చేరింది. నిత్యం దీని ధర మారుతుంటోంది. అయితే ఇంతకీ ఈ ధరను ఎవరు నిర్ణయిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. దీని ధరను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది.. అందుకు ఎలాంటి సంస్థలు నిర్ణయాత్మకంగా ఉంటాయి.. అనే అంశాలను తెలుసుకుందాం.పసిడి ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలులండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) ఫిక్సింగ్ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్‌బీఎంఏ రోజుకు రెండుసార్లు బెంచ్‌మార్క్ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తాయి.గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లుకమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్.. మానిటరీ పాలసీరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.ద్రవ్యోల్బణం.. ఆర్థిక అనిశ్చితిబంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలుదిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలుభారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.కరెన్సీ మారకం రేట్లుబంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.పండుగలు, వివాహాలుదేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.దేశీయ సరఫరా, ఆభరణాల మార్కెట్ ధోరణిబంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ)ఐబీజేఏ గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు.

జుక్.. జాబ్స్.. గేట్స్.. వీళ్ల సీక్రెట్ ఇదేనా?
స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్.. ముగ్గురూ టెక్ ప్రపంచాన్ని శాసించి బిలియన్ డాలర్లు సంపాదించిన వ్యాపారాధినేతలు. వీరి విజయ రహస్యమేంటో తెలిసిపోయింది! బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దార్శనికత, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రధాన లక్షణాలుగా ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికీ సారూప్యత ఉన్న అంశం మరొకటి ఉందని డొనాల్డ్ జి కాస్టెల్లో కాలేజ్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు వెల్లడించారు.ఒకటే చేతివాటంఈ ముగ్గురు సీఈఓలు ఎడమచేతి వాటం వారే. జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫైనాన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎడమచేతివాటం కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణలు, విజయవంతమైన కంపెనీలతో దూసుకెళ్లడానికి, వారి ఎడమ చేతి వాటానికి సంబంధం ఉంది. కుటుంబ అనుభవాలు, జన్యుపరమైన వారసత్వం, అకడమిక్ నేపథ్యం, వారు ఎంచుకున్న కెరీర్ మార్గాలు, ఇంకా మరెన్నో అంశాలు కూడా సీఈఓల విజయాలకు కారణం కావచ్చని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ లాంగ్ చెన్ తెలిపారు.ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 472 కంపెనీలకు చెందిన 1,000 మందికి పైగా సీఈవోలను విశ్లేషించారు. రాయడం, గీయడం, తినడం, విసరడం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన సీఈఓల ఫొటోలు, వీడియోలను పరిశీలించి వారి ఆధిపత్యాన్ని నిర్ధారించారు. అనుమానం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు ఫోన్లు చేయడం లేదా వివరణ కోసం ఈమెయిల్స్ పంపడం చేసేవారు. వారు ఏ చేతి మణికట్టుపై వాచీలు ధరించారో కూడా తాము గమనించామని అధ్యయనకర్తలు చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎడమచేతి వాటం ఉన్నవారు వాచీని తమ కుడి చేతికి ధరిస్తారు.అధ్యయన ఫలితాలుసీఈఓల్లో అత్యధికులు కుడిచేతి వాటం వారే. వీరు 91.4 శాతం మంది ఉండగా 7.9 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం వారున్నారు. 0.7 శాతం మంది రెండు చేతివాటాలున్నవారు తేలారు. లెఫ్ట్ హ్యాండ్ సీఈఓల నేతృత్వంలోని సంస్థలు గణనీయంగా అధిక సృజనాత్మక ఉత్పత్తిని ప్రదర్శించాయని, మరింత ప్రత్యేకమైన పేటెంట్లను కలిగి ఉన్నాయని తదుపరి విశ్లేషణలో వెల్లడైంది.ఏదైనా సంస్థ కుడిచేతివాటం ఉన్న సీఈవో నుంచి ఎడమచేతివాటం సీఈఓకి చేతుల్లోకి మారిన తర్వాత ఆ సంస్థ పేటెంట్లు, ప్రశంసాపత్రాల సంఖ్య మరింత పెరుగుతోందని ఫలితాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఎడమచేతివాటం సీఈవో నుంచి కుడిచేతివాటం సీఈఓకి మారిన కంపెనీల ఇన్నోవేషన్ అవుట్‌పుట్‌లో ఇలాంటి మార్పు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది.ఎడమచేతివాటం సీఈఓలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారు దేశీయ ఉద్యోగుల కంటే ఎక్కువ ఇన్నోవేషన్ అవుట్ పుట్ ఇస్తారని భావిస్తారు.కుడిచేతివాటం సీఈవోలతో పోలిస్తే ఎడమచేతివాటం సీఈవోలు కాస్త ఎక్కువ ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు.
ఫ్యామిలీ

ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్‌తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు.

హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం.

వజ్రాల నెక్లెస్, బెనారస్ సిల్క్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పడూ సరికొత్త లుక్‌తో అందర్నీ ఆశ్యర్యపరుస్తుంటారు. మరోసారి తాజాగా అలాంటి మెస్మరైజ్ లుక్‌తో మెరిశారు. ఆ విశేషాలేంటో చూద్దామా..!.నీతా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారతదేశ గొప్ప హస్తకళను ప్రదర్శించే ఫ్యాషన్ ఐకాన్. ఆమె సదా విశాలమైన బంగారు అంచులతో కూడిన చీరలతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు . కేవలం ప్రతిభాపాటవాలే కాదు, అప్పడప్పుడూ మన డ్రెస్ సెన్స్ కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుందని తన స్టైలిష్ ఫ్యాషన్వేర్లతో చెబుతూనే ఉంటారామె. ఈసారి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో అద్బుతమైన లుక్‌తో ఆకర్షించారు. చీరలంటే అమితంగా ఇష్టపడే నీతాని ఈ వేడుకలో బెనారస్ సిల్క్ చీరలో తళుక్కుమన్నారు. సంక్లిష్టమైన బహుళ వర్ణ పూల ఎంబ్రాయిడరీ డిజైన్‌తో చీర హైలెట్‌గా నిలిచింది. ఆ చీర లుక్‌కి సరిపోయే మ్యాచింగ్ బ్లౌజ్ జత చేశారు. ఆ చీరకు తగ్గట్టు స్టేట్మెంట్ డైమండ్ స్టడ్ చెవిపోగులు, ప్రకాశవంతమైన ఎరుపు మాణిక్యాలతో పొదగబడిన డైమండ్ నెక్లెస్‌తో ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కాంతివంతమైన లుక్‌లో కనిపించారామె. అందుకు తగ్గ మేకప్, స్టైలిష్ హెయిర్ స్లైల్‌తో రాజరికానికి అద్దం పట్టేలా ఆమె ఆహార్యం అదిరిపోయింది. కాగా, వేవ్స్ 2025(WAVES 2025) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఈ నెల మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, క్రియేటర్లు, విధాన రూపకర్తలతో సహా 90కి పైగా దేశాల నుంచి సుమారు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’)
ఫొటోలు


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)


'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)
అంతర్జాతీయం

ఖనిజ ఒప్పందం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్‌లోని అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన ఆయన దాన్ని చేజిక్కించుకోవడంలో అడుగు ముందుకేశారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతి ఇస్తేనే రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నెలకొల్పడానికి సహకరిస్తానంటూ మెలికపెట్టి ఉక్రెయిన్ను దారికి తెచ్చుకున్నారు. ట్రంప్ ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ట్రంప్‌కు అనుమతి ఇచ్చేశారు.ఈ మేరకు ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంతకాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. ఉక్రెయిన్ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కిపైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్కు సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తివివరాలను ఇరు దేశాలు ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాయి.ఈ కొత్త ఒప్పందాన్ని ‘యూఎస్–ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్’ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్–అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోయింది. అప్పట్లో వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలు ఫలించి, ఒప్పందం కుదిరింది. అమెరికాతో ఈ ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిమీహల్ చెప్పారు. ఖనిజాల తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా లభిస్తుందన్నారు. మూర్ఖుడిగా ఉండదల్చుకోలేదు: ట్రంప్ ఉక్రెయిన్‌కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దానికంటే అధికంగా తిరిగి పొందబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదల్చుకోలేదని అన్నారు. ఒకచోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనని పరోక్షంగా తేల్సిచెప్పారు. మరోవైపు ఒప్పందాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది సమానమైన, గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి సైనిక సాయం పొందడానికి ఇది కీలకంగా మారుతుందని ఆకాంక్షించింది. అమెరికాతో బంధం బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని, తమ దేశంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిధి దోహదపడుతుందని వెల్లడించింది. కీలకాంశాలు.. ఉక్రెయిన్–అమెరికా ఖనిజ ఒప్పందంలో కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం.. ఆ డబ్బును ఉక్రెయిన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రష్యా పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతోంది. రష్యాకు సహకరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా సంకేతాలిచ్చింది. ఖనిజాలను తవ్వుకొనే అవకాశం అమెరికాకు ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్‌కే దఖలు పరిచారు. యూ రోపియన్ యూనియన్(ఈయూ)లో చేరాలన్న ఉక్రె యిన్ ఆకాంక్షను అమెరికా ఇకపై అడ్డుకోదు. ఈయూతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు. ఆ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యం?ఇతర దేశాల్లో లేని ఆరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ కేంద్రంగా మారింది. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటివి నిక్షిప్తమ య్యాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ను ప్రపంచంలోనే విలువైన ఖనిజ వనరులు కలిగిన దేశంగా నిలబెట్టింది. ఆధునిక కాలానికి అవవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వ వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటివి ఉక్రెయిన్‌లో పుష్కలంగా ఉన్నా యి.ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడిమియం, డిస్ప్రోసి యం, నియోబియం, టాంటాలమ్, బెరీలియం, కోబాల్ట్, మాంగనీస్, జిర్కోనియం వంటి ఖనిజా లకు లోటులేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ప్రధానంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఉక్రెయిన్‌లోని ఖనిజ వనరులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5 శాతానికిపైగా ఉక్రెయిన్‌లోనే ఉండడం గమనార్హం.

ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు. యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025
జాతీయం

రోడ్డుపై వైమానిక గర్జన
షాజహాన్‌పూర్ (యూపీ): పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు మన సైన్యం దీటుగా బదులిచి్చంది. సంప్రదాయ యుద్ధక్షేత్రాలకు భిన్నంగా నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది. పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్్రస్టిప్పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. తొలిసారిగా శుక్రవారమే పరీక్ష గంగా ఎక్స్‌ప్రెస్ వే ఎయిర్్రస్టిప్ను శుక్రవారమే తొలిసారిగా పరీక్షించారు. ఎయిర్‌ఫోర్స్ విభాగంలోని టాప్ ఫైటర్లు దీన్ని వినియోగించాయి. గంగా ఎక్స్‌ప్రెస్ వే ఇప్పటికే 85 శాతం నిర్మాణం పూర్తయింది. యూపీలో ఆగ్రా–లఖ్‌నవూ, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేల మీదా ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించారు.గంగా ఎక్స్‌ప్రెస్ వే మీద మాత్రమే ప్రస్తుతానికి రాత్రివేళ ఆపరేషన్‌కు అనువుగా అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను సిద్ధంచేశారు. ఈ ఎయిర్ర్స్టిప్ను సంఘవ్యతిరేక శక్తులు పాడుచేయకుండా కనిపెట్టేందుకు 250కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎయిర్‌్రస్టిప్ పరీక్షను స్వయంగా తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు వచ్చారు. రక్షణ శాఖ, యూపీ రాష్ట్ర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.రోజంతా చక్కర్లు రాత్రిపూట ల్యాండింగ్, టేకాఫ్‌కు ముందు పగటిపూట యుద్ధ విమానాలను ఎయిర్ర్‌స్టిప్‌పై చాలాసార్లు విజయవంతంగా దింపారు. యుద్ధ సమయాల్లో వైమానిక స్థావరాలు, రన్‌వేలను శత్రు విమానాలు ధ్వంసం చేస్తే అత్యవసరంగా యుద్ధ విమానాలను దించడానికి, మళ్లీ సమరానికి సిద్ధమై వెనువెంటనే టేకాఫ్ తీసుకోవడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వేలపై ఇలా ఎయిర్్రస్టిప్లను నిర్మిస్తున్నారు. యుద్ధ సమయాల్లో సైనికులు, ఆయుధాలు, సైనిక ఉపకరణాలను మోసుకెళ్లే భారీ సరకు రవాణా విమానాలు సైతం దిగేలా వాటిని అత్యంత పటిష్టంగా నిర్మించారు.ఈ ఎయిర్్రస్టిప్ను అత్యంత అరుదుగా మాత్రమే వాడే అవకాశం ఉందని తెలిసి కూడా మన్నిక, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.

పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.

తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు.

పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాన మంత్రి 'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను శుక్రవారం భారతదేశంలో బ్లాక్ చేశారు.కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిన తర్వాత ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి. రెచ్చగొట్టే.. మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేసినందుకు ఈ ఛానెల్‌లను నిషేధించారు.'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు.. గాయకుడు అతిఫ్ అస్లాం, క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజం, నటుడు ఫవాద్ ఖాన్, హనియా అమీర్, మహిరా ఖాన్‌లతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ చేశారు.పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్‌హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు.

భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది. సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు. శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వంట బాగా లేదని భార్య హత్య దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్‌కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్‌తో కలిసి అయ్యప్పనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్‌లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్‌కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు.

నన్నే నీ భర్త అనుకో.. భర్త ఎదుటే భార్యపై వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు తాగిన మత్తులో రెచ్చిపోయి హల్చల్ చేశారు. రాత్రి వేళ దారిలో వెళ్తున్న భార్యాభర్తలను అడ్డుకుని.. మహిళను వేధింపులకు గురిచేశారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.. అంటూ వేధించారు. టచ్‌లో ఉండాలంటూ ఓవరాక్షన్‌కు దిగారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్–8 పబ్‌కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.మరింత ఓవరాక్షన్ చేస్తూ.. నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధింపులకు గురిచేశారు. ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. అనంతరం, వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తుండగా.. బేగంపేట నుంచి రహ్మత్ నగర్‌కు వచ్చే దాకా వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.అయితే, వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్‌తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


అమ్మమ్మ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మధుమతి


అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబర్ మోసగాడి అరెస్ట్


Ding Dong 2.0: డింగ్ డాంగ్ 2.0 కామిక్ షో


గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలకు మజ్జి శ్రీనివాసరావు కౌంటర్


వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు


సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ కో కన్వీనర్ ఫణీంద్ర ఫైర్


పునఃనిర్మాణ సభతో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు


పాకిస్థాన్ కు వరుస షాక్ లు ఇస్తున్న భారత్


వరదలు వస్తే చేపలు పట్టుకునే ప్రాంతంలో రాజధానా? శైలజానాథ్ సెటైర్లు


రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్