Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CM Chandrababu1
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

Pahalgam: Sri Lankan Airlines Flight From Chennai Searched At Colombo2
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?

కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్‌ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్‌ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్‌ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్‌ భల్వాల్‌ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ నిస్సార్‌ అహ్మద్‌, ముస్తాక్‌ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్‌ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్‌ చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

Police Detained Accused Of Vizag Incident3
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!

విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్‌ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు.

Virat Kohli Picks Toughest Bowler He Has Faced In Test Cricket4
నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీరే: విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి.. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. మూడు ఫార్మాట్ల‌లోనూ కింగ్ కోహ్లి త‌న‌కంటూ ఒక‌ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2008లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టాడు.భార‌త క్రికెట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత గొప్ప క్రికెట‌ర్‌గా కీర్తింప‌బ‌డ్డాడు.వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ప‌ది వేల ప‌రుగులు మైలు రాయిని అందుకున్న బ్యాట‌ర్ కూడా కోహ్లినే కావ‌డం విశేషం. అటు కెప్టెన్‌గా కూడా కోహ్లి త‌న మార్క్‌ను చూపించాడు. టెస్టుల్లో భార‌త్ త‌ర‌పున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా విరాట్ క్రీజులో ఉన్నాడంటే ప్ర‌త్య‌ర్ది గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. అయితే తాజాగా మూడు ఫార్మాట్ల‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల జాబితాను కోహ్లి వెల్ల‌డించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లెజండ్ జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, వ‌న్డేల్లో శ్రీలంక దిగ్గ‌జం ల‌సిత్ మలింగ, ఇంగ్లండ్ స్టార్ స్పిన్న‌ర్ అదిల్ ర‌షీద్‌, టీ20ల్లో వెస్టిండీస్ స్పిన్న‌ర్ స‌నీల్ న‌రైన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది ప‌డిన‌ట్లు కోహ్లి పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో కోహ్లిపై ఆండ‌ర్స‌న్‌కు మంచి రికార్డు ఉంది. ఏడు సార్లు కోహ్లిని ఆండ‌ర్స‌న్ ఔట్ చేశాడు. మ‌రోవైపు లసిత్ మ‌లింగా కూడా చాలా సంద‌ర్భాల్లో కోహ్లిపై పై చేయి సాధించాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో కోహ్లిపై మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ సునీల్ న‌రైన్ సైతం మంచి ట్రాక్ రికార్డు క‌లిగి ఉన్నాడు.ఇక కోహ్లి ఈ ఏడాది జూన్‌లో తిరిగి భార‌త త‌ర‌పున ఆడ‌నున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానునున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2025లో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి(443) ఐదో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.చ‌ద‌వండి: అత‌డొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్

PM Modis Decisive Action Against Terrorism Vow5
ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్‌ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది.

Will Strike Any Structure Built To Divert Indus Water: Pak Minister6
మరింత అగ్గి రాజేసేలా.. పాక్‌ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

తీరుమార్చుకోని పాకిస్థాన్‌ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్‌ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్‌ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్‌ ఓడలపై భారత్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్‌ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్‌, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

Robert Kiyosaki Explains How Employment is Closely Linked to the Market Crash7
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్‌ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్‌ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్‌ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025

farmer turned entrepreneur earns rs 7 lakhs per month by millet idli8
దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఫుడ్‌ బిజినెస్‌కు ఎపుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్‌ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్‌ సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్‌ సక్సెస్‌ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్‌ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్‌లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్‌ స్టాల్‌ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

KSR Comments On Yellow Media And Chandrababu9
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!

రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Vijay Devarakonda Clarifies Tribes Remarks10
‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్‌ రాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్‌ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్‌అయితే విజయ్‌ మాత్రం ట్రైబ్స్‌ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్‌ తన ఎక్స్‌ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎ‌వరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement