వాగులో పడి యువకుడి మృతి
దెందులూరు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్‌రోడ్డు సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కంతేటి రమేష్ (28) శనివారం మృతి చెందాడు. పది మంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అనంతరం స్నానం చేయడానికి సోకిలేరు వాగులో దిగగా, లోతు అంచనా తెలియక మునిగిపోయాడు. రమేష్‌ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఇంటర్ వరకు చదివి కొబ్బరి దింపు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రమేష్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి రామసింగవరం నుంచి బొలెరో వాహనంలో వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఏలూరు (టూటౌన్): కాలువలు కట్టేలోగా చెరువులను నీటితో నింపుకోవాలని జలవనరుల శాఖ ఎస్‌ఈ చిలకపాటి దేవప్రకాష్ సూచించారు. ఈ వేసవిలో ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్ జలవనరుల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేిశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని కాలువలు కట్టే లోపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


