రాధాకృష్ణవి చెత్త పలుకులు | - | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణవి చెత్త పలుకులు

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

రాధాకృష్ణవి చెత్త పలుకులు

మహిళలకు క్షమాపణలు చెప్పాలి

ఏలూరులో వైఎస్సార్‌సీపీ బైక్‌ ర్యాలీ

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. చెత్త పలుకులు పలికిన ఏబీఎన్‌ రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి తొలుత కొద్ది దూరం ర్యాలీగా వస్తూ.. అనంతరం భారీ బైక్‌ ర్యాలీతో నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాతబస్టాండ్‌ రైల్వే ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి మీదుగా పాతబస్టాండ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌, కర్రల వంతెన, జూట్‌మిల్లు సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ మీదుగా మోటారు సైకిల్‌ ర్యాలీ చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆందోళన చేశారు. జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా నీచపు రాతలతో మహిళల మనోభావాలను కించపరుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా పత్రికలు, మీడియా తనవంతు పాత్ర పోషిస్తుందని, ఏబీఎన్‌ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాల్లోని మహిళల వ్యక్తిత్వాలను అవహేళన చేస్తూ.. పార్టీ నేతలకు వెన్నెముక లేనివారంటూ తన వీకెండ్‌ కామెంట్లో చెప్పటం నీచమైన విధానానికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు ఏమి చెబితే అది టీడీపీ నేతలు, కార్యకర్తలు పాటిస్తారనీ వారిపై ఇలాంటి వీకెండ్‌ కామెంట్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా వైఎస్సార్‌సీపీ పార్టీలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ నిరసనలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, కార్పొరేటర్‌ ఇనపనూరి కేదారేశ్వరి, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, మహిళ నేతలు కంచుమర్తి తులసి, అచ్యుతకుమారి, రుబీనా, రావి సునీత, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి కొల్లిపాక సురేష్‌, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాష్‌, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి లంకపల్లి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement