ఆగని మట్టి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాలచెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ పచ్చ నాయకుడు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నాడు. పెద్దస్థాయిలో మట్టి తరలింపు జరుగుతన్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో అద్దూఅదుపు లేకుండా ఈ దందా సాగిపోతోంది. గ్రామంలోని సత్తాల ఇరిగేషన్‌ చెరువులో ఓ టీడీపీ నాయకుడు రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు తరలించేస్తున్నాడు. ఒక్కో టిప్పర్‌ మట్టిని దూరాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రజాధనాన్ని బహిరంగంగా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement