నేత్రపర్వం.. ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. ధ్వజారోహణం

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ వేడుక శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఈ వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కల్యాణమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిమిత్తం యాగశాలలో ధ్వజపటంపై గరుత్మంతుని చిత్రపటాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో లిఖించారు. పూజలు, హోమాది కార్యక్రమాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటానికి హారతులిచ్చి, దానిని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణ తంతును నిర్వహిస్తామని అర్చకులు జరిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement