ముమ్మిడివరం: స్థానిక జాతీయ రహదారి కాశివాని తూము బైపాస్ రోడ్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పాలకొల్లు ప్రాంతం గగ్గిపర్రుకు చెందిన రందికట్ల ఏసురాజు (18) మృతి చెందగా లంకల కోడేరుకు చెందిన కొయ్య రాజకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు యానాం నుంచి మోటారు సైకిల్‌పై వస్తూ ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. వాహనంపై వెనుక కూర్చున్న ఏసురాజు జారిపడడంతో బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందాడు. రాజ్‌కుమార్ కొంచెం దూరం వెళ్లి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


